దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవకర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్ష లేకుండానే.. కేవలం టెన్త్ క్లాస్ మార్కులతో అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
అప్లై చేయండిలా..
టెన్త్ క్లాస్ పాసైన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏపీలో 1,215, తెలంగాణాలో 519 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగతా వారు కేవలం రూ.100 చెల్లిస్తే చాలు.
అప్లై చేసుకున్న అభ్యర్థులను మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎక్కువ మార్కులు ఉన్న వారికి ఉద్యోగం ఇస్తారు. ఈ విషయాన్ని ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.
జీతభత్యాలు
ఉద్యోగానికి ఎంపికైన వారికి బీపీఎం పోస్టులకు రూ. 12000–29380, డాక్ సేవక్ పోస్టులకు నెలకు రూ. 10వేలు – 24,740 చెల్లిస్తారు.
దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 3 వరకు అవకాశం ఉంది.
https://indiapostgdsonline.gov.in/Reg_validation.aspx
పై లింక్ ద్వారా అప్లై చేయండి.
GDS POSTAL JOBS: తపాల శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు