రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇతర రేషన్ సరుకులకు తీసుకుంటున్న వారు తప్పని సరిగా ఈ కేవైసీ e-kyc చేయించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే..
అయితే ఈ e-kyc ప్రక్ర్రియ జనవరి 31వ తేదీతో ముగియనుండగా.. మరోసారి అనగా ఫిభ్రవరి నెలాఖరు వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు e-kyc పూర్తి చేసుకోని లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలసి సూచించింది.
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ e-kyc ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జారీ చేసిన రేషన్ కార్డు లబ్దిదారుల్లో చనిపోయిన వ్యక్తులు ఇతర కారణాల చేత రేషన్ సరుకులు తీసుకోని లబ్దిదారుల ఏరివేతలో భాగంగానే.. రేషన్ కార్డులు e-kyc ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. గడువులోగా.. ఈ కేవైసీ చేయించుకోని వారికి జాబితా నుంచి తొలగించనుంది.
ఇప్పటి వరకు తెలంగాణాలో 75.76 శాతం నమోదైంది. చాలా చోట్ల సాంకేతిక సమస్యల కారణంగా కేవైసీ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిని అధిగమించి గడువులోగా..100 శాతం నమోదు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రేషన్ కార్డు లబ్దిదారులు అర్హత ఉండి… రేషన్ సరుకులు పొందేందుకు ఫిబ్రవరి నెలాఖరు లోగా తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాల్సిందే.. గుర్తుంచుకోండి.. మీ మిత్రులకు ఈ సమాచారాన్ని చేరవేయండి.
RATION CARDS E-KYC-రేషన్ కార్డుల ఈ కేవైసీ..