DSC FREE COACHING 2024
ఏపీలో త్వరలో నిర్వహించే మెగా డీఎస్సీలో భాగంగా ప్రిపేరవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాష్ట్రంలోని నిరుపేద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందుకు అర్హులు.. పూర్తి వివరాలివే…
రాష్ట్రంలో 16వేల టీచర్ పోస్టుల భర్తీకీ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్ 02న టెట్ ఫలితాల విడుదల అనంతరం నవంబర్ 03న డీఎస్సీ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇందులో భాగంగా టెట్ అర్హత సాధించిన ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు ఉచిత డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జ్క్షాన భూమి వెబ్సైట్ ద్వారా http://https//jnanabhumi.ap.gov.in ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. ఉచిత డీఎస్సీ శిక్షణ కోసం అక్టోబర్ 27న స్క్రీనింగ్ టెస్టును నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన మార్కులకు టెట్ మార్కులు 15శాతం వెయిటేజీ ఇచ్చి మెరిట్ లిస్టు తయారు చేస్తారు.
అనంతరం ఉచిత డీఎస్సీ శిక్షణకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 30న ప్రకటిస్తారు. వీరికి నవంబర్ 06వ తేదీ నుంచి మూడు నెలల పాటు శిక్షణ అందిస్తారు.
మరిన్ని వివరాలకు http://patashaala,com వెబ్సైట్ను సంప్రదించండి.
DSC FREE COACHING: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు