వడ్డె నవీన్ సినీ కెరియర్ అర్ధాంతరంగా ముగియడానికి కారణం ఏంటో తెలుసా..?

వడ్డే నవీన్.. ప్రస్తుత జనరేషన్ వారికి పెద్దగా పరిచయం లేని హీరో..కానీ ఫేస్ చూస్తే గుర్తుపడతారు. జాబిలమ్మ నీకు అంత కోపమా అనే పాటతో ఒక్కసారిగా అందరిలో క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ హీరో. ఇక మొదటి సినిమాతోనే ఇండస్ట్రీకి మరొక మంచి ఫ్యామిలీ హీరో దొరకాడని చాలామంది దర్శక నిర్మాతలు సంతోషపడ్డారు. కానీ ఈయన ఎంత త్వరగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారో, అంతే త్వరగా ఇండస్ట్రీ నుండి కనుమరుగైపోయారు. మరి ఈ హీరో కెరియర్ ఎందుకు ఇలా పతనం అవ్వాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. నవీన్ తండ్రి నిర్మాత కావడంతో తన కొడుకుని ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని భావించాడు.

ఇక కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్. ఇక మొదటి సినిమానే మంచి హీట్ అయింది. ఆ తర్వాత వచ్చిన పెళ్లి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చాలా మంది దర్శక నిర్మాతలు ఈయన ఇంటి ముందు క్యూ కట్టారు. ఇక ఈయన వరుసగా సినిమాల్లో నటించి కొన్ని భారీ హిట్ సినిమాలను అలాగే కొన్ని ప్లాఫులను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక వడ్డె నవీన్ సినీ కెరియర్ ఐదేళ్లపాటు చాలా సజావుగా సాగింది.కానీ ఐదు ఏళ్ల తర్వాత ఈయన నటించిన శత్రువు, అయోధ్య, చక్రి, నా ఊపిరి వంటి వరుస సినిమాలు ప్లాఫ్ అవుతూ వచ్చాయి. దీంతో వడ్డె నవీన్ కెరియర్ ముగింపు దశకు వచ్చింది.

ఇక 2001 నుండి 2010 వరకు ఈయన నటించిన దాదాపు అన్ని సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాయి. ఇలా వెండితెరపై నవీన్ సినీ కెరియర్ ముగిసింది అనే టాక్ దర్శక నిర్మాతల్లో వచ్చింది. అయితే వడ్డె నవీన్ కెరియర్ ముగిసి పోవడానికి ప్రధాన కారణం కథల ఎంపికలు సరిగ్గా చేసుకోకపోవడమే. జనరేషన్ కి తగ్గట్టు ట్రెండ్ ని తన సినిమాల్లో పరిచయం చేయకపోవడం వల్ల ఈయన నటించిన వరుస సినిమాలు ప్లాప్ అయ్యాయి. అంతేకాకుండా వ్యక్తిగత విషయంలో కూడా ఎన్టీఆర్ మనవరాలను పెళ్లి చేసుకొని మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకోవడం వల్ల కూడా అతని సినీ కెరియర్ కాస్త డిస్టర్బ్ అయ్యింది. అందువల్లే వడ్డె నవీన్ సినీ కెరియర్ అర్ధాంతరంగా ముగిసింది.

వడ్డె నవీన్ సినీ కెరియర్ అర్ధాంతరంగా ముగియడానికి కారణం ఏంటో తెలుసా..?