గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో మూడు గొడవలు ఆరు కొట్లాటలుగా సాగుతోంది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ లో కాస్తో కూస్తో మార్పు వచ్చింది అనుకున్న సమయంలోనే మళ్లీ సీనియర్ల మధ్య పుట్టిన లొల్లి ఢిల్లీ వరకు చేరింది. దీంతో దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగి వారి మధ్య సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి వినతులు ఫిర్యాదులు అందుకున్న దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉందని, దీన్ని మీరు ఉపయోగించుకోవాలని నాయకులకు సూచించారు.
ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప రోడ్డుపై పడవద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ముగిస్తూ అంతా సెట్ అయింది నో ప్రాబ్లం అంటూ చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు సంయమానాన్ని పాటించాలని, మీ మధ్య వచ్చే అభిప్రాయ బేధాలను బయట పెట్టుకోవద్దని అన్నారు. అలా మీకు మీరే బహిరంగ విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని తెలియజేశారు.
మీ అందరికీ దండం పెడుతున్న ఏ సమస్య ఉన్నా అంతర్గతంగా లోలోపల చర్చించుకోండి తప్ప బయటపడవద్దని ప్రాధేయపడ్డాడు. కెసిఆర్ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత చాలా వరకు ఉందని దానిని మీరు ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడాలి ప్రజా సమస్యలు తీర్చాలి తప్ప, మీకు మీరే పొట్లాడుకుంటే వచ్చేది ఏమీ లేదని దిగ్విజయ్ సింగ్ హితవు పలికారు. ఏది ఏమైనా కాంగ్రెస్ లో గల్లి నుంచి ఢిల్లీ వరకు ఇలాంటి గొడవల వల్లే రోజురోజుకు దిగజారి పోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.