సౌందర్య మరణానికి ముందు ఇన్ని ప్రమాదాల నుండి తప్పించుకుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి అందాల నటి సౌందర్య అంటే తెలియని వారు ఉండరు. అలాంటి అందాల భామ తన అంద చందాలు నటన అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొని చివరికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. దాదాపుగా ఆమె చనిపోయి 18 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ ఏదో ఒక రకంగా సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె అభిమానులు మాత్రం ఇప్పటికీ ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంటే ఆమెకు ఎంతటి ఆదరణ ఉండేదో మనందరం అర్థం చేసుకోవచ్చు.

కేవలం పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే ఇలా ప్రమాదం జరగడం. అప్పటికే ఆమె 3 నెలల గర్భవతి అని తెలుస్తోంది. అలాంటి సౌందర్య 31 సంవత్సరాలకే మరణించింది. అయితే సౌందర్య మరణానికి ముందు చాలా ప్రమాద సూచనలు కూడా జరిగాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆమె సరిగ్గా వారం రోజుల్లో చనిపోతుంది అనగా ఒక సంఘటనగా జరిగింది. ఆమె చివరి సారిగా నటించిన చిత్రం శివశంకర్ షూటింగ్ జరుగుతుండగా కుర్చీలో కూర్చొని ఉంది. ఈ క్రమంలోనే సెట్ మొత్తం విరిగిపోయి ఆమె కూర్చున్న స్థలంలోనే పడింది. కానీ అక్కడ సౌందర్య లక్కీగా క్షణం ముందే ఆ విరుగుతున్న కుర్చీ నుండి లేసిందట.

అలా ఆ ప్రమాదం నుంచి బయటపడింది. ఆ తర్వాత కరీంనగర్ బిజెపి మీటింగ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఆమెకు ఒక ప్లేన్ ఏర్పాటు చేయగా, ఒకరోజు ముందు టెక్నికల్స్ ప్రాబ్లమ్స్ వల్ల విమానం మురాయించిందట. ఆమె విమానం పాడైందని తెలిసి ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఉంటే కచ్చితంగా ఆ ప్రాణగండం నుంచి బయటపడేది. కానీ ఇచ్చిన మాట కోసం సౌందర్య తన అన్న స్నేహితుడి ప్లేన్ తెప్పించుకోవడం ఆ విధంగా మీటింగ్ కి బయలుదేరడం , అది కుప్పకూలడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ విధంగా ఆమె మరణానికి ముందు అనేక ప్రమాద సూచికలు ఆమెను వెంటాడాయని చెప్పవచ్చు.

సౌందర్య మరణానికి ముందు ఇన్ని ప్రమాదాల నుండి తప్పించుకుందా