హీరోయిన్ శ్రీ లీల ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు. పెళ్లి సందD సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందానికి చాలామంది అభిమానులు కనెక్ట్ అయిపోయారు. అప్పటినుంచి దర్శక నిర్మాతలు శ్రీ లీలా వెంట పడుతున్నారు. ఈ తరుణంలో సినిమా హిట్ అయినా కాకపోయినా ధమాకా ఛాన్స్ ఇచ్చాడు రవితేజ.
తాజాగా రిలీజ్ అయిన ధమాకా మూవీలో శ్రీ లీలా యాక్టింగ్ మరో లెవల్ లో ఉందని చెప్పవచ్చు. రవితేజ ఎనర్జీ యాక్టింగ్ కు శ్రీలీలా అందాలు తోడై ఆడియన్స్ ను మరింత ఆకట్టుకున్నారు. సినిమా ఎలా సాగుతున్నా కానీ శ్రీలీలా అందాల కోసం ఒక్కసారైనా చూడవచ్చు అని అభిమానులు అంటున్నారు. కథలో బలం లేకపోయినా రొటీన్ స్టోరీ అయినా కానీ ఆమె అందచందాలతో కేక పుట్టిస్తోంది అని చెప్పవచ్చు.
ఇలా రెండవ సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీ లీలా ధమాకా సినిమా ఛాన్స్ రావడం అదృష్టంగా చెప్పవచ్చు. ఒకవేళ ధమాకా సినిమా హిట్ సాధిస్తే మాత్రం శ్రీలీలా పేరు మార్మోగిపోతుంది. ఇప్పటికే ఈ అమ్మడు చేతిలో అరడజన్ సినిమాలు ఉన్నాయి. ధమాకా హిట్ అయినా ఫ్లాప్ అయినా పెద్దగా ప్రాబ్లం వచ్చింది అయితే ఏమీ లేదు. దీన్నిబట్టి చూస్తే శ్రీలీలా కు ఫ్యూచర్ బాగానే ఉందని చెప్పవచ్చు.
కాక పుట్టిస్తున్న హీరోయిన్ శ్రీలీలా..?