న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది. కొత్త ఏడాది సందర్భంగా మెట్రో సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్టు తెలియజేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం 2022 ఆదాయంపై శ్వేతా పత్రం విడుదల చేసింది. గత సంవత్సరం కంటే ఈసారి ఆదాయం రెట్టింపు అయింది. మొత్తం 1320 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.
కాశ్మీర్ లో కురుస్తున్న మంచు తుఫాన్ తో కాశ్మీర్ అందాలు మరింత పెరిగాయి. ఆ అందాలను చూస్తే మీరు కూడా అక్కడికి వెళ్లి తిలకించాలనే ఫీలింగ్ వస్తుంది.
కరోనా పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక : కరోనా వేరియంట్ ఇంకా తొలిగిపోలేదని , ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అలెర్ట్ చేసింది. అతి పెద్ద సమస్య చైనా నుంచి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. దీనికి సీక్వెల్ పుష్ప2 వస్తోంది. ఈ తరుణంలో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. పుష్ప2కు సుకుమార్ భారీ బడ్జెట్ పెడుతున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా 400 కోట్ల నుంచి 500 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం.
మూడో తరగతి విద్యార్థి పై సీనియర్ల దారుణం. టాయిలెట్ లో నలుగురు సీనియర్ విద్యార్థులు చిన్నారిపై దాడి చేసి మర్మం గానికి దారం కట్టిన ఘటన ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.
నష్టాలతో ముగింపు: 2022 ఏడాదిని స్టాక్ మార్కెట్లన్నీ నష్టాలతో ముగించాయి. మధుపర్లు లాభాలు స్వీకరించడంతో శుక్రవారం సెన్సెక్స్ నిఫ్టీ నష్టపోయాయి.
రిషబ్ పంత్ ను కాపాడింది ఆ బస్సు డ్రైవర్. వేగంగా వచ్చి బోల్తా కొట్టిన కారులో రిషబ్ పంత్ తీవ్ర గాయాల పాలైయ్యారు. అటుగా వస్తున్న బస్సు డ్రైవర్ దిగి అతడ్ని కాలుతున్న కారులోంచి బయటకు తీశాడు. అందులో ఉన్న ఒక బ్యాగ్ మరియు 7000 రూపాయలు అంబులెన్స్ డ్రైవర్ కు అందించి అతనిని ఆసుపత్రికి తరలించాడు.
వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని హోం మంత్రి అమిత్ షా ప్రజలను కోరారు. కర్ణాటకలోని మాండ్యాలో జనసంకల్ప సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా మరియు చైనా మధ్య బంధాన్ని మరింత సుదృఢం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ , చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ శుక్రవారం వెల్లడించారు.