December 28 top news: ఈరోజు ముఖ్యవార్తలు..!

  1. నేటి నుంచి రైతుబంధు డబ్బులు.. మొదటి విడతలో ఎకరం లోపు రైతులకు, ఆ తర్వాత ఐదెకరాలు ఆ పైన భూములు ఉన్నవారికి రైతుబంధు జమ కానుంది.
  2. నేడు భద్రాచలంకు రానున్న రాష్ట్రపతి ద్రౌపతి మూర్ము. మొన్నటికి మున్నా శ్రీశైలం వెళ్ళింది.
  3. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
  4. ఆసియా ఖండంలోనే అతి తక్కువ జీతం తీసుకునే ప్రధాని నేపాల్. మన కరెన్సీ ప్రకారం ఎంత జీతం తీసుకుంటారంటే..77,280 రూపాయలు.
  5. న్యూయార్క్ నగర అందాలను ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30 మూవీ షూటింగ్ ప్రారంభం కారుంది.
  6. టి20 ఫార్మాట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బాయ్. ఈ ఏడాది టీమిండియా ప్రదర్శన ఎలా ఉన్నా కానీ విరాట్ కోహ్లీ మాత్రం అదరగొట్టడని చెప్పవచ్చు. కానీ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కు కొంతకాలం దూరంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.
  7. అమెరికాలో మంచు కల్లోలం సృష్టిస్తుంది. మైనస్ డిగ్రీల చల్లదనాన్ని తట్టుకోలేక చాలామంది మృతి చెందుతున్నారు.
  8. జియో 5జి కి సంబంధించి షాఓమి సాఫ్ట్వేర్ అప్డేట్ ను విడుదల చేసింది.
  9. కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది సంతానం కలగడం లేదని భార్యపై విచక్షణారహితంగా దాడి చేసి కాళ్లు చేతులు విరిచేసాడు.
  10. చైనాలో బిఎఫ్ 7 వేరియంట్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. దీని దాటికి ఇప్పటికే ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు. ప్రపంచ దేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరిస్తోంది.