December 26 top news: ఈరోజు ముఖ్యవార్తలు:

1.తారస్థాయికి చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల వివాదం. పలు సూచనలు చేసిన దిగ్విజయ్ సింగ్. వివాదాలకు ముగింపు పలకాలని హితవు. ఠాగూర్ స్థానంలో మరొకరి నియమించే అవకాశం.

  1. నేడు శ్రీశైలం వెళ్లనున్న ద్రౌపది మూర్ము. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని రాష్ట్రపతి ద్రౌపది మూర్ము దర్శించుకొనున్నారు.
  2. వెలుగులోకి వచ్చిన మరో ఆదిమానవుడి గృహ : ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలం మొహిదనుపురంలో మరో అభిమానుడు గృహ వెలుగులోకి వచ్చింది. చరిత్ర అధ్యాపకురాలు కందుల సావిత్రి దీనిని కనుగొన్నది.
  3. వీరు మార్కుల్లోనూ కవలలే: పశ్చిమ బెంగాల్ లో ఉన్న ఇద్దరు కవల పిల్లలు .. వీరు పోలికల్లోనే కవలలు కాదు , మార్కుల్లో కూడా కవలలే అని నిరూపించారు. వేర్వేరు విభాగాల్లో చదువుకున్నా కానీ మార్కులు మాత్రం ఇద్దరికీ సేమ్ వచ్చాయి.
  4. అలియా భట్ కి ఏమైంది :
    సోషల్ మీడియాలో హీరోయిన్ అలియా భట్ ఫోటో వైరల్ గా మారింది. ఆమె తలకిందులుగా ఉంటూ వ్యాయామం చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది.
  5. హమ్మయ్య భారత్ గెలిచింది : ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టెస్టులో మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించింది.
  6. డాలర్ పై పోటు : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే ఎంతో బలంగా ఉన్న డాలర్ క్రమంగా తగ్గుతుందని పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి.
  7. నేపాల్ దేశానికి కొత్త ప్రధాని ఎన్నికయ్యారు.ఓలీ మద్దతుతో పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రధానిగా ఎన్నికయ్యారు.
  8. ప్రాణం తీసిన సూక్ష్మ రుణాలు: పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో సూక్ష్మ రుణం కాస్త లేట్ అయిందని అధికారులు వచ్చి ఇంటికి తాళం వేయడంతో, అవమానాన్ని భరించలేక అత్తా కోడలు మరణించారు.
  9. చైనాలో ఇప్పటికే కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ తరుణంలో శాస్త్రవేత్తలు మరో ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. ఇందులోనే కొత్త వేరియంట్లు పుట్టే అవకాశం ఉందని వారు అంటున్నారు.
  10. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగిసినట్టే: చర్చలకు సిద్ధంగా ఉన్న ఇరుదేశాల అధ్యక్షులు.