- గ్రూప్ 4 పై గందరగోళం : తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్ 4 నోటిఫికేషన్ లో గందరగోళం నెలకొంది. 9,168 పోస్టులపై దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.
2.ఏపీలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయోపరిమితి ఐదేళ్లు పెంచమంటే,రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
- విమానంలో మీరు ఒక తరగతిలో ప్రయాణించడానికి టికెట్ తీసుకున్నచో.. మీ ప్రమేయం లేకుండానే విమానయాన సంస్థ వాటిని మార్చితే మాత్రం మీ ప్రయాణానికి సంబంధించి పూర్తి ఖర్చులు ఆ సంస్థ భరిస్తుంది.
- తెలుగు బుల్లితెర యముడిగా అందరికీ సుపరిచితమైన కైకల సత్యనారాయణ పార్థివ దేహానికి సినీ ప్రముఖులంతా నివాళులర్పిస్తున్నారు.ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
- ఐపీఎల్ మినీ వేలం: ఐపీఎల్ చరిత్రలోనే సాముకు అత్యధిక ధర దక్కింది.18.5 కోట్లతో పంజాబ్ సొంతం చేసుకుంది. కెమెరాన్ కోసం 17.5 కోట్లు, స్ట్రోక్స్ కు 16.5 కోట్లు, పురాన్ కు 16 కోట్లు.
6.2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు వరుసగా 6.8%,6.1% నమోదయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనా వేసింది.
- రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం అనేది ముగింపు దశకు చేరుకున్నట్టు ఆయా దేశాల అధ్యక్షులు వేర్వేరు ప్రకటనల్లో తెలియజేసినట్లు తెలుస్తోంది.
- వాట్సాప్ లింక్ ఓపెన్ చేస్తున్నారా ప్రమాదమే: ముంబైలో మహిళకు వాట్సప్ లింక్ వచ్చింది ఓపెన్ చేయగానే ఆమె ఖాతాలోంచి 9 లక్షలు మాయమయ్యాయి.
- ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. భారత్ బయోటెక్ వృద్ధి చేసిన నాజిల్ టీకాలను 18 సంవత్సరాలు నిండిన వారికి బూస్టర్ డోస్ గా అందించేందుకు మరో ముందడుగు వేసింది.
- నాలుగు వారాల్లో 16 లక్షల కోట్ల ఆవిరి : ప్రపంచ దేశాల్లో కోవిద్ విస్తరిస్తున్న తరుణంలో ఈ ఎఫెక్ట్ వ్యాపార రంగాల పై పడింది. దీంతో నాలుగు వారాల్లో 16 లక్షల కోట్ల నష్టం వచ్చిందని వ్యాపార నిపుణులు అంటున్నారు.