1.ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ సక్సెస్.. ఈ సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 30 ఏళ్ల ముందు చూపుతో తెలుగు రాష్ట్రాలను డెవలప్మెంట్ చేసామని అన్నారు. మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే అవకాశామే లేదని తెలిపారు. భవిష్యత్తును నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఆయన అన్నారు.
- రాష్ట్రంలో ఇకనుంచి డిజిటల్ బోధన .. నాడు నేడు కింద తొలివిడతలో 15,175 పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ బోధన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.
- తను చేసిన తొలి సినిమాతోనే ఎంతగానో ఆకట్టుకున్న కథానాయక శ్రీలీలా.. కే.రాఘవేంద్రరావు సమర్పణలో పెళ్లి సందడి మూవీ తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఓవైపు ఎంబిబిఎస్ కోర్స్ కంప్లీట్ చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటుంది.
- రాజస్థాన్లో ఓ మహిళ ఒకేసారి ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చింది. వారికి ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండగా మగపిల్లాడి కోసం చూస్తే ఇలా జరిగింది. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు.
- మరోసారి దూసుకు వస్తున్న కరోనా.. ఈసారి వచ్చే వేరియంట్ చాలా ప్రమాదకరమని, ముఖ్యంగా గుండె, క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
- జాతీయ స్విమ్మింగ్ లో తెలంగాణ యువతీకి పసిడి పథకం దక్కింది. జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ సిమ్మింగు కాంపిటీషన్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వరితి అగర్వాల్ బంగారు పతకం సాధించింది.