December 21 top news: ఈరోజు ముఖ్యవార్తలు..!

  1. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు రాఘవరెడ్డిల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది.
  2. ఉచితలతో ఆనందం తాత్కాలికమే అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియా సమావేశంలో తెలియజేశారు.
  3. మరోసారి ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వండి: నేను దేవుడికి కోరుకునేది ఇదే అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో క్రిస్మస్ విందుకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

4.ఒక కూలి పని చేసే వ్యక్తికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. 14 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను కట్టలేదని నోటీసులు జారీ చేసింది.

  1. గత మూడు సంవత్సరాల నుంచి చైనా ప్రభుత్వం కరోనా కారణంగా కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ఈ మధ్యకాలంలోనే సడలింపు ఇవ్వడంతో మళ్లీ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. రానున్న మూడు నెలల్లో చైనాలో 60 శాతం, మిగతా దేశాల్లో 10% కోవిద్ కేసులు పెరిగే అవకాశం ఉందని, అమెరికా అంటూ వ్యాధి నిపుణుడు ఎరిక్ పెగైన్ అన్నారు.
  2. ఆస్ట్రేలియా 5 T20 ఇప్పటికే కోల్పోయిన భారత మహిళల జట్టుకు ఆఖరి మ్యాచ్లో కూడా నిరాశ తప్పలేదు. మంగళవారం హార్మత్ ప్రీత్ జట్టు 54 పరుగుల తేడాతో ఆసిష్ చేతిలో చిత్తయింది.
  3. నయనతార ముఖ్యపాత్రలో నటించిన హర్రర్ మూవీ ‘కనెక్ట్”(connect)డిసెంబర్ 22వ తేదీన తమిళ, తెలుగులో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
  4. భారత్ లో వాహన పరిశ్రమపై వీధిస్తున్న పన్నులపై మారుతి సుజుకి చైర్మన్ భార్గవ స్పందించారు. ఇది ఇలాగే కొనసాగితే వృద్ధి కష్టమని భావించారు.