December 20 top news- ఈరోజు ముఖ్య వార్తలు..!

1.మంత్రులుvs ఎమ్మెల్యేలు:
తెలంగాణ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. నిధుల కేటాయింపు మరియు నామినేటెడ్ పదవులు ఇతర పోస్టులపై ప్రోటోకాల్ వంటి వివాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

  1. ఏపీ పోలీసులపై విరుచుకుపడ్డ మోహన్ బాబు.
    నాకు పోలీసులు అంటే చాలా గౌరవం, కానీ ప్రస్తుతం అధికారంలో ఏ ప్రభుత్వము ఉన్న వారికి తొత్తులుగా పనిచేయాల్సి వస్తోందని మోహన్ బాబు విమర్శించారు.
  2. హద్దులు దాటనీయం :
    చైనా సరిహద్దు రేఖను (lAC) మార్చాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత సైన్యం దీటుగా తిప్పి కొడుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి, జై శంకర్ స్పష్టం చేశారు.
  3. మైదానంలో పులిలా చెలరేగిన మెస్సి ఎట్టకేలకు ప్రపంచ కప్ సాధించాడు. అంతేకాదు ఆయన ఇంస్టాగ్రామ్ లో కూడా మరో రికార్డు తన సొంతం చేసుకున్నాడు.ఆయన పెట్టిన ఒక్క పోస్టుకు నాలుగు కోట్లకు పైగా లైకులు వచ్చాయి. దీంతో క్రిస్టియానో రోనాల్డో రికార్డును బ్రేక్ చేశాడు.

5.fixed deposits: త్వరలో బ్యాంకులు డిపాజిట్ల రేట్లు పెంచనున్నాయి. దీంతో ఎఫ్డిఏ పై అధిక వడ్డీ లభించే అవకాశం కనిపిస్తోంది.

  1. థాయిలాండ్ తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గల్ఫ్ మరియు థాయిలాండ్ తీరాల్లో గస్తీకి తిరుగుతున్న HTMS సుకోతాయి అనే యుద్ధ నౌక సముద్రతీరంలో మునిగిపోయింది. అందులో ఉన్న 31 మంది నావికులు గల్లంతయినట్టు తెలుస్తోంది.
  2. చతిస్గడ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బు విషయంలో ముదిరిన వివాదంలో ప్రియురాలు ప్రియుడిని హతమార్చి డ్రమ్ములో తీసుకెళ్లి తగలబెట్టింది.