December 16 top news: ఈరోజు ముఖ్య వార్తలు..!!

1.టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిందని త్వరలోనే పార్టీకి విఆర్ఎస్ తప్పదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదలుపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  1. బదిలీ సిపార్స్ వెనక్కి తీసుకోవాలి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు, దేవానంద్, జస్టిస్ డి రమేష్ ల బదిలీకి సంబంధించి సిఫార్సులను హైకోర్టు వ్యతిరేకిస్తూ, కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
  2. పరిపాలన చేయడంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి, ప్రజా జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేయడమే తమ లక్ష్యం అంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
  3. అవతార్ కథ ఏంటంటే : అవతార్ కోసం జేమ్స్ కామెరును సాంకేతికతతో పండోరా అనే ప్రపంచాన్ని సృష్టించాడు. ప్రకృతి ప్రాణంగా జీవించే వింత ప్రాణులకు, అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్లే మానవులకు జరిగే పోరాటమే అవతార్ వే ఆఫ్ వాటర్..
  4. భారత్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్ లో భారత్ పై చేయి సాధించింది.రెండవ రోజు సమంగా నిలిచిన బంగ్లాదేశ్ పై ఆదిపత్యాన్ని ప్రదర్శించిన పై భారత్ స్థానంలో నిలిచింది.
  5. చైనాను వదలని కోవిద్. నిబంధనలు సడలించి 15 రోజులు గడవక ముందే మళ్ళీ భారీగా పెరిగిన కేసులు.
  6. వచ్చే ఏడాది భారత్ ఆర్థిక వ్యవస్థ చాలా కష్టమని, వృద్ధికి అవసరమైన సంస్కరణలు తేవడంలో ప్రభుత్వం విఫలమైందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు.