December 15 top news: ఈరోజు ముఖ్య వార్తలు..!!

1.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి ద్వారా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకు వచ్చే దిశగా ముందుకు సాగుతారని మంత్రి కేటీఆర్ అన్నారు.

  1. ఏపీ తెలంగాణ మధ్య ఉన్నటువంటి ఆస్తులు అప్పులను వేగంగా విస్తరించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం రీట్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఆర్టికల్ 14,21లో పొందుపరిచిన హక్కులతో పాటుగా విభజన అనంతరం వారికి దక్కాల్సిన ప్రయోజనాల గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
    3.ట్రైన్ లో వయోవృద్ధులకు ఇచ్చే రాయితీలను ప్రస్తుతం పునరుద్ధరించే పరిస్థితి లేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. రైల్వేలో పింఛన్లు ఉద్యోగుల వేతనాల భారం అధికంగా పడుతోందని రాయతీలను పునరుద్ధరించడం వీలు కాదని పార్లమెంట్లో వెల్లడించింది.
    4.చిరంజీవి కథానాయకుడుగా వస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ నుంచి ఒక చిన్న సాంగ్ బిట్ ను సోషల్ మీడియా వేదిక గా చిరంజీవి లీక్ చేశారు.
    5.భారత్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న చైనా విషయంలో గట్టి గుణపాఠం నేర్పాలని ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు.
    6.సాధారణ కార్మికులకు అమెరికా స్వాగతం: నిపుణులు కానటువంటి సాధారణ విదేశీ కార్మికులకు అమెరికాలో పనిచేయడం కోసం మొట్టమొదటిసారిగా 64716 తాత్కాలిక వీసాలను మంజూరు చేరినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
  2. December 15 top news: ఈరోజు ముఖ్య వార్తలు..!!