CRPF ఎస్ఐ, head కానిస్టేబుల్..1458 పోస్టులు.. జీతం ఎంతో తెలిస్తే షాకే..!!

చాలామంది నిరుద్యోగులు గత కొంతకాలం నుంచి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ crpf si, అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 1458 ఎస్ఐ స్టెనో, హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్ )ఖాళీలు ఉన్నాయి.

అర్హత: ఇంటర్మీడియట్ లేదంటే దాని తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ముఖ్యంగా, పురుషులైతే 165 సెంటీమీటర్లు, మహిళలు 155 సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉండాలి.

వయస్సు:
2023 జనవరి 25వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

ఎంపిక విధానం:
స్కిల్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

పరీక్ష విధానం :
పరీక్ష రాయడానికి పూర్తి కాలం 90 నిమిషాలు. ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది. వంద మార్కులకు గాను 100 ప్రశ్నలు ఇస్తారు. హిందీ, ఇంగ్లీష్ భాషలలో జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలను అడుగుతారు.

జీతాలు: ఎస్సై పోస్ట్ కు రూ”29,200 నుండి రూ” 92,300 వరకు ఉంటుంది. కానిస్టేబుల్ పోస్ట్ కు రూ”25,500 నుండి రూ”81,100ఉంటుంది.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి 4 న అవుతుంది. ఈ చివరి తేదీ జనవరి 25. పరీక్ష తేదీలు ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్య ఉంటుంది.

వెబ్సైట్ : https://crpf.gov.in/

CRPF ఎస్ఐ, head కానిస్టేబుల్..1458 పోస్టులు.. జీతం ఎంతో తెలిస్తే షాకే..!!