టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా రోడ్ కి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తన తల్లిని చూడడానికి వెళుతున్న రిషబ్ పంత్ ఈ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి మూడు పల్టీలు పడడంతో తీవ్ర గాయాలతో రిషబ్ పంత్ కారులోనే ఉండిపోయారు. ఇంతలో మంటలు చెలరేగాయి. ఎలాగోలా కారు అద్దాలను పగలగొట్టుకొని రోడ్డు పైకి వచ్చాడు. వెంటనే గమనించిన స్థానికులు అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
రిషబ్ పంత్ ప్రమాదం జరిగిన వెంటనే కారు మంటల్లో చిక్కుకుంది. పంత్ సమయస్ఫూర్తితో బయటకు రావడంతో అతిపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని చెప్పవచ్చు. ఈ ఘటనలో రిషబ్ పంత్ తలకు మరియు మోకాలికి, భుజాల భాగాలపై తీవ్ర గాయాలు అవ్వడమే కాకుండా కాలిపోయిందని సమాచారం. అంతేకాకుండా కాలు కూడా విరిగినట్టు తెలుస్తోంది.
ఈ ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. అతనికి మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులైను అప్రమత్తం చేశారు. అవసరమైతే ఢిల్లీకి షిఫ్ట్ చేసేందుకు ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని తెలియజేశారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి . ఈ ఘటన గురించి తెలుసుకున్న రిషబ్ అభిమానులంతా ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయారు.. ఆయన త్వరగా కోలుకొని బయట పడాలని కోరుకుంటున్నారు.
rishab pant car accident:క్రికెటర్ రిషబ్ పంత్ కు ఘోర రోడ్డు ప్రమాదం.. ఇక ఆడడం కష్టమేనా..?