గత రెండు సంవత్సరాల కాలం పాటు కరోనా కారణంగా అనేక ఇబ్బందులు పడ్డాం.. కనీసం ఇంట్లో నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి. ఎంతోమంది రోడ్డున పడ్డారు. దీంతో ప్రపంచ దేశాలన్ని అల్లా కల్లోలమయ్యాయి.. లక్షలాదిమంది మృతి చెందారు ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అలాంటి కరోనా 2022లో కాస్త తగ్గుముఖం పట్టింది. మళ్లీ 2023 సమీపిస్తున్న తరుణంలో మరో కొత్త వేరియట్ కలవరం సృష్టిస్తోంది.. అదే carona BF7 వేరియంట్. ఇప్పటికే ఇది చైనా రాష్ట్రంలో కలవరం సృష్టించి ప్రపంచ దేశాలకు కూడా పాకే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి.
ఇక భారతదేశం విషయానికి వస్తే గుజరాత్ లో రెండు కేసులు, అలాగే ఒడిశాలో కూడా కేసులు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా భారత దేశ ప్రజల్లో భయం పట్టుకుంది. ఇదే కాకుండా బ్రిటన్,అమెరికా, బెల్జియం, జపాన్, ప్రాన్స్, డెన్మార్క్ వంటి దేశాల్లో కేసులు అనేకం పెరుగుతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవియా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ వేరియంట్ పై వివరాలు వెల్లడించారు . BF7 వేరియంట్ కేసులు గుర్తించినప్పటికీ దీని వ్యాప్తిలో ఎలాంటి పెరుగుదల లేదని స్పష్టం చేశాడు. చైనాలో ఈ కేసులు ఎక్కువగా పెరగడానికి కారణం అక్కడి ప్రజల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటమేనని అన్నారు. ఇండియాలో ఇప్పటికే డబల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
BF7 లక్షణాలు:
దగ్గు, జ్వరం తక్కువగా ఉంటుంది.
కీళ్ల నొప్పులు
తలనొప్పి
మెడల నొప్పులు
ఆకలి తక్కువగా ఉండటం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఇలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. దానికి తగిన మందులు తీసుకోవాలి. పౌష్టికాహారం తినాలి..సామాజిక దూరం పాటించాలి. పరిశుభ్రంగా ఉండాలి.ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అంతేకాకుండా జనాల్లో గుంపులు గుంపులుగా ఉండకూడదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.