Coal India Recruitment – Registrations from today
కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు కోల్ ఇండియా అధికారిక వెబ్సైట్ (coalindia.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ మంగళవారం మొదలుకానుంది.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలోని 640 పోస్టులను భర్తీ చేయనున్నారు.
గేట్ 2024 స్కోర్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ జరుగుతుంది.
కోల్ ఇండియా రిక్రూట్మెంట్ 2024..
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: అక్టోబర్ 29, 2024
దరఖాస్తుకు చివరి తేదీ- 2024 నవంబర్ 28
ఖాళీల వివరాలు..
మైనింగ్: 263 పోస్టులు
సివిల్: 91 పోస్టులు
ఎలక్ట్రికల్: 102 పోస్టులు
మెకానికల్: 104 పోస్టులు
సిస్టెమ్: 41 పోస్టులు
ఈ అండ్ టీ: 39 పోస్టులు
అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయోపరిమితిని తెలుసుకునేందుకు కోల్ ఇండియా రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ని చూడాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ డైరక్ట్ లింక్ కోసం (coalindia.in) ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపిక విధానం..
కోల్ ఇండియాలో ఉద్యోగాల కోసం గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్-2024)కు అర్హత సాధించి ఉండాలి. గేట్-2024 స్కోర్లు/మార్కులు, అవసరాన్ని బట్టి అభ్యర్థులను తదుపరి ఎంపిక ప్రక్రియ కోసం మెరిట్ క్రమంలో 1:3 నిష్పత్తిలో విభాగాల వారీగా, కేటగిరీల వారీగా షార్ట్‌లిస్ట్ చేయడం జరుగుతుంది. గేట్ 2024 స్కోర్లు/ మార్కుల ఆధారంగా ప్రతి విభాగానికి తుది మెరిట్ జాబితాను తయారు చేస్తారని గుర్తుపెట్టుకోవాలి.
దరఖాస్తు ఫీజు
జనరల్ (యూఆర్) / ఓబీసీ (క్రీమీలేయర్ & నాన్క్రెమిలేయర్) / ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు నాన్ రిఫండబుల్ ఫీజు రూ.1000/- తో పాటు వర్తించే జీఎస్టీ – రూ.180/- మొత్తం రూ.1180 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు ఫీజును ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు కోల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.