చాణక్యుడు గొప్ప పండితుడు . చంద్రగుప్త మౌర్యుడికీ ఎంతో సహకరించిన గొప్ప వ్యక్తి. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా ఎన్నో విషయాలను చెప్పారు. ముఖ్యంగా ఆయన సామాజిక, రాజకీయ, స్త్రీ, పురుషుల భార్యాభర్తలకు సంబంధించిన అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో వివరించారు. మరి చాణక్యుడి చెప్పిన దాని ప్రకారం మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే ఎలాంటి పురుషులైనా వారికి ఇట్టే అట్రాక్ట్ అవుతారని ఆయన అన్నారు.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ధైర్యం ఉన్న మహిళ:
చాణక్య నీతి శాస్త్రం ప్రకారం పురుషులను అట్రాక్ట్ చేసే కొన్ని లక్షణాలు స్త్రీలలో ఉంటాయి. ముఖ్యంగా పురుషుల కంటే స్త్రీలు చాలా ధైర్యంగా ఉంటారు. ఈ విధంగా స్త్రీలకు ధైర్యం ఉంటే ఇంట్లో వ్యక్తులు కష్టాల్ని అనుభవించాల్సి ఉంటుంది.
సాహసం గల మహిళ:
కొంతమంది మహిళలు జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడిన దానికి అనుగుణంగా సాహసంతో ముందుకు వెళ్తారు . ఇలాంటి వారిని పెళ్లి చేసుకున్న వ్యక్తి అన్నిట్లో విజయం సాధిస్తాడు.
ధర్మాన్ని పాటించే స్త్రీ :
ముఖ్యంగా జీవితంలో ధర్మం వైపు నిలబడే మహిళ అన్ని విషయాల్లో క్లారిటీగా ఉంటుంది. ఇలాంటివారు ప్రతిరోజు పూజలు చేస్తారట. ఈ విధంగా స్త్రీలు ఇళ్లలో పూజలు చేయడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయని చాణుక్యుడు అంటున్నారు.
ప్రశాంతమైన మహిళ :
కొంతమంది మహిళలకు కోపం బాగా ఉంటుంది. వీరి వల్ల పురుషులకు ఇబ్బందులే. కానీ ప్రశాంతమైన మహిళ ఇంట్లో ఉంటే ఇల్లంతా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందని చాణక్యుడు అంటున్నారు.
పెద్దలను గౌరవించే స్త్రీ:
ముఖ్యంగా స్త్రీలకు ఉండే ప్రధాన లక్షణం పెద్దలను గౌరవించడం. ఈ అలవాటు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్న పురుషులు చాలా అదృష్టవంతులు. ఇలాంటివారు ఏ సమస్యలైనా ఇట్టే పరిష్కరించి ఇంట్లో ఆనందాన్ని ఉంచుతారట.
స్వీట్ గా మాట్లాడే స్త్రీ :
ఎవరితో అయినా ఇట్టే కోపానికి రాకుండా వారి మాటలతో అట్రాక్టివ్ చేసే స్త్రీలు పురుషుడికి భార్యగా దొరికితే మంచిదని, ఈ లక్షణాలు ఉన్న స్త్రీలనే పురుషులు ఎక్కువగా ఇష్టపడతారని ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా తెలియజేస్తున్నారు.
Chanakya niti:స్త్రీలలో ఈ లక్షణాలు ఉంటే ఎలాంటి పురుషులైనా ఇట్టే పడిపోతారు..!