Chanakya nithi:ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం సర్వనాశనమే..!!

సాధారణంగా పెళ్లి చేసుకునే ముందు మన పెద్దలు కొన్ని విషయాలు ఊరికనే చెప్పలేదు. పెళ్లి విషయంలో అబ్బాయి కైనా సరే, అమ్మాయి కైనా సరే అటు ఎడు తరాలు , ఇటు ఏడు తరాలు చూసుకొని చేసుకోవాలి అంటారు. వారు అనడం వెనుక కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చానిక్యుడు పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ఉండే కొన్ని లక్షణాల గురించి తన నీతి శాస్త్రంలో బోధించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  1. పెళ్లి చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోమన్నారు.. ఈ రోజుల్లో ఏడు తరాలు చూడాలంటే ఇక మీరు బ్రహ్మచారిగా మిగలాల్సిందే.. అలాకాకుండా కనీసం వారి కుటుంబంలోని తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉందో గమనించి చేసుకోండి. తల్లిదండ్రులు సత్ప్రవర్తన కలిగిన వారైతే ఎలాంటి అనుమానం లేకుండా పెళ్లి చేసుకోండి. ఒకవేళ అమ్మాయి అందంగా ఉండి తల్లిదండ్రులు సత్ప్రవర్తన లేదంటే ఆ అమ్మాయిని వదిలేయడమే మేలు అన్నారు చాణక్యుడు..
  2. చాలామంది మొగాళ్ళు ఆఫీస్ పనులు లేదంటే ఇతర జాబ్స్ వల్ల అలసిపోయి ఇంటికి వస్తారు. ఈ తరుణంలో చేసుకున్నటు వంటి ఇల్లాలు ఇంటి శుభ్రతతో పాటు మిమ్మల్ని కూడా నవ్వుతూ పలకరించి మాట్లాడితే అన్ని టెన్షన్స్ తొలగిపోతాయని చాణక్యడు అంటున్నారు. అలాంటి ప్రవర్తన ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అన్నారు.
  3. చాలామంది అమ్మాయిలు అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది అమ్మాయిలు మాత్రం వారి అందాన్ని మాత్రమే చూస్తూ మిగతావన్నీ మర్చిపోతారు. ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్ళు చేసుకున్న భర్తకు ఏదైనా ప్రమాదం జరిగి అందం పోతే ఆయనతో వీళ్ళు ఉండడానికి అస్సలు ఇష్టపడరు.. ఇలాంటి అందాన్ని ఇష్టపడే అమ్మాయిలను కాకుండా మనసును ఇష్టపడే అమ్మాయిలను చేసుకోవాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు.
  4. ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ కాకుండా చీటికిమాటికి గొడవలు పెట్టే అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం డేంజర్ అంటున్నారు చాణక్యుడు.
    • Chanakya nithi:ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం సర్వనాశనమే..!!