మిగ్జాం తుఫాన్ ప్రభావం కారణంగా ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించింది. ఏపీతో పాటు తమిళనాడులో తుఫాన్ త్రీవ రూపం దాల్చింది. ఆయా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం దృష్ట్యా జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
ఇప్పటికే తుఫాన్ ప్రభావం కారణంగా ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు డిసెంబర్ 05న కూడా సెలవు ప్రకటించాలని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, గుంటూరు, ప్రకారం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది.
తుఫాన్ హెచ్చరికల కారణంగా హైదరాబాద్ నుంచి ఏపీ నడిచే రైళ్లు నిలిచిపోయాయి. ఈ మేరకు ప్రయాణికులకు రైల్వే శాఖ ప్రకటన జారీ చేసింది.