తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ను మించిన నాయకుడు లేడు అనే పేరు ఉంది.. ఆయన తన రాజకీయ చతురతతో ఇప్పటికి రెండుసార్లు అధికారంలోకి వచ్చాడు. ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. గత రెండు పర్యాయాలు కెసిఆర్ కు తెలంగాణలో ఎదురులేదు. ఏదో ఒక విధంగా ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో కెసిఆర్ దిట్ట అని చెప్పవచ్చు. ఆయన ఆలోచన శక్తి ముందు ఎవరైనా తట్టుకొని నిలబడడం కష్టమే. అంతటి ఘనత కలిగిన నాయకుడు కేసీఆర్..
అలాంటి కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు.. ఇక ఈ పార్టీతో దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో వారి పార్టీకి సంబంధించి ఇన్చార్జిలను నియమించే పనిలో ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రతీ చోటా పోటీ చేస్తుందని గట్టి నినాదంతో ముందుకు వెళ్తున్నాడు..
బీఆర్ఎస్ బిజెపికి ప్లస్ అవుతుందా..?
ఒక విధంగా తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ను దిటుచేసే నాయకులు కాంగ్రెస్ నుంచే ఉన్నారు. కానీ కాంగ్రెస్ లో గొడవల వల్ల వారి పార్టీరోజురోజుకు క్షీణించిపోతుంది. ఈ తరుణంలో బండి సంజయ్ సారథ్యంలో, ఈటల తోడుగా బిజెపి వారి యొక్క సారథ్యాన్ని పెంచుకుంటుంది.. రోజురోజుకు ముందుకెళ్తోంది. కెసిఆర్ కు దిటైనా నాయకులం మేమే అంటూ చెప్పుకుంటుంది.. ఇన్ని రోజులు కేసీఆర్ కేవలం తెలంగాణపై దృష్టి పెట్టి ఏ పార్టీని అయినా తిప్పి కొట్టారు.
ఆయన ఆలోచన ముందు వీరంతా తుడిచిపెట్టుకుపోవడమే అనే ఆలోచన ప్రజల్లో ఉండేది. ప్రస్తుతం కెసిఆర్ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈ తరుణంలో తెలంగాణలో పూర్వం ఎంత ఆలోచనతో ఉన్నారో ఇప్పుడు అంత దృష్టి పెట్టే అవకాశం లేదని, దీంతో బీజేపీకి మేలు జరుగుతుందని బిజెపి నాయకులు సంబరపడిపోతున్నారట.. మరి చూడాలి రాను రాను బిజెపి పుంజుకుంటుందా, కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా.. లేదంటే కెసిఆర్ దాటికి రెండు పార్టీలు కొట్టుకుపోతాయా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.
థాంక్యూ కేసీఆర్ అంటున్న బిజెపి నేతలు.. వారి ఆనందం వెనుక అసలు వ్యూహం ఇదేనా..?