BEST APPS FOR TEACHERS: టీచర్లకు ఉపయోగపడే బెస్ట్​ యాప్స్​…డౌన్​డోడ్​ చేసేకోండి..

అరచేతితో మొబైల్..అంతా ఆన్లైన్​ ప్రపంచం.. మెసెజ్​ల నుంచి మనీ ట్రాన్స్​ఫర్​ వరకు నిత్యజీవితంలో యాప్​ల వినియోగం కూడా బాగా పెరిగింది. వ్యాపార, వాణిజ్య, విద్య రంగాల్లోనూ  యాప్​ల అవసరం తప్పనిసరిగా మారింది. అయితే పాఠాలు బోధించే టీచర్లకు ఎన్నో రకాల యాప్​లు ఉన్నాయి. తరగతిలో టీచర్ల సమయాన్ని ఆదా చేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అవేంటో.. ఇక్కడ తెలుసుకోండి.   

డ్రాయింగ్ వేయడానికి వైట్‍బోర్డ్

పాఠాలు చెప్పాలన్నా, లెక్కలు చేయాలన్నా, డ్రాయింగ్‍ వేయాలన్నా, స్కెచ్‍ గీయాలన్నా.. అందరూ చూసే యాప్‍ LiveBoard Interactive Whiteboard. ఇందులో డ్రాయింగ్‍ వేయవచ్చు. డయాగ్రమ్స్ గీయవచ్చు. మొత్తంగా ఈ యాప్ మీకు ఒక వైట్ బోర్డ్ లాగా పనిచేస్తుంది. తరగతిలోని బ్లాక్‍బోర్డ్ పై రాస్తున్న భావనతోనే టీచింగ్‍ చెప్పేలా దీనిని రూపొందించారు. రాసుకోవడానికి అన్‍లిమిటెడ్‍ వైట్‍బోర్డులుంటాయి. డ్రాయింగ్‍, రైటింగ్స్ వంటి వాటిని సోషల్‍ మీడియాలో షేర్‍ చేయవచ్చు. టెక్ట్స్ టూల్స్ కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్‍ ఇంటెలిజెన్స్ తో పని చేసే షేప్‍ రికగ్నిషన్‍ టూల్‍ తో ఎక్స్‌పర్ట్ లాగే డ్రాయింగ్‍ వేయవచ్చు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చాట్‍ చేసుకునే ఫీచర్‍ కూడా ఉంది.

సమయం ఆదాకు సీసా

విద్యార్థులను భాగస్వాములను చేసి వారి పర్‍ఫార్మెన్స్ ను అంచనా వేయాల్సిన బాధ్యత ప్రతి టీచర్‍పై ఉంటుంది. కానీ తరగతిలో అందరిపై దృష్టి సారించాలంటే ఉపాధ్యాయులకు తగిన సమయం ఉండదు. అటువంటి వారు ఎక్కడి నుంచైనా స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్  అవుతూ వారి నుంచి బెస్ట్ అవుట్‍పుట్‍ రాబట్టడానికి తోడ్పడుతుంది Seesaw: The Learning Journal యాప్‍. విద్యార్థుల నుంచి ఫీడ్‍బ్యాక్‍, రెస్పాన్స్ వంటివి వ్యక్తిగతంగా తీసుకోవడంతో పాటు ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకంగా దృష్టి సారించవచ్చు. నిత్యం తరగతిలో బోధించే పాఠాలకు సంబంధించిన అంశాలకు ఆన్‍లైన్‍లో సిద్ధంగా ఉండే వీడియో, గ్రాఫిక్స్ మెటీరియల్‍ ఎంతగానో తోడ్పడుతుంది. ఉచితంగా వాడుకోగలిగిన ఈ యాప్‍ ద్వారా విద్యార్థుల ఫర్‍ఫార్మెన్స్ వివరాలు స్టోర్‍ చేసుకోవడంతో పాటు ఎప్పుడైనా వెలికితీసుకునే సౌకర్యం ఉంది. పేరెంట్స్ కు ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపవచ్చు. ఈ యాప్‍ సిరీస్‍లో ఉండే Seesaw Parent & Family యాప్‍తో కుంటుంబం, బంధువులతో నిత్యం టచ్‍లో ఉండవచ్చు. ముఖ్యంగా మీ పిల్లలతో రోజూ కాంటాక్ట్ అవొచ్చు. వారి ప్రోగ్రెస్‍ రిపోర్టులు, తరగతి వారీగా అటెండెన్స్, పర్‍ఫార్మెన్స్, స్కూళ్లో నిత్యం వచ్చే నోటీసులు, అనౌన్స్‌మెంట్స్ వంటి వాటిని తెలుసుకోవచ్చు. మీ పిల్లలకు వాయిస్‍ మెసేజ్‍ పంపవచ్చు. టెక్నాలజీపై అంతగా అవగాహన లేని వారు సైతం సులువుగా వినియోగించేలా ఉంటుందీ యాప్‍.

క్విజ్‍ ఏదైనా.. ఉందిగా కహూత్‍

ఎప్పుడైనా,  ఎక్కడైనా క్విజ్‍లు తయారు చేసి మీ విద్యార్థులతో ప్రాక్టీస్‍ చేయించాలనుకుంటున్నారా? అయితే Kahoot యాప్‍ మీ మొబైల్‍లో ఉండాల్సిందే. ట్రవియా క్విజ్‍లు, లైవ్‍ గేమ్‍ క్విజ్‍లు వంటివి తయారుచేసి స్టూడెంట్స్ ను భాగస్వాములను చేయవచ్చు. ఇందులో ర్యాంకులు కూడా అనౌన్స్ చేసే సౌకర్యం ఉంది. ఈ యాప్‍ హోంవర్క్, అసైన్‍మెంట్స్ కూడా ఇవ్వడానికి తోడ్పడుతుంది. ఆన్‍లైన్లోనే కరెక్షన్‍ చేసి మార్కులు, గ్రేడింగ్ ఇవ్వడం తో పాటు రిజల్స్ట్ కూడా యాప్‍లోనే అనౌన్స్ చేయడం వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా ఆన్‍లైన్‍ క్లాసెస్‍, ట్రైనింగ్‍ వంటి వాటితో స్టూడెంట్స్ ను ఎంగేజ్‍ చేసి యాక్టివ్‍  పార్టిసిపెంట్స్ గా మార్చడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

పిల్లల భద్రతకు ఐకేర్‍ టీచర్స్

ఐకేర్‍ నర్సరీ సిస్టంలో భాగంగా పిల్లల రక్షణకు ఉపయోగపడేలా ఐకేర్‍ కిడ్స్, ఐకేర్‍ సీ (తల్లిదండ్రుల కోసం), ఐకేర్‍ టీచర్స్ అనే యాప్‍లను యాప్‍-వేర్‍ సంస్థ తయారు చేసింది. ఇందులో తరగతిలోని విద్యార్థులందరితో నిత్యం కాంటాక్స్ట్ మెయిన్‍టెన్‍ చేయడానికి icare Teachers యాప్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. విద్యార్థుల జాబితా ను తయారు చేయడంతో పాటు వారికి ఎప్పటికప్పుడు అలర్ట్స్ నోటిఫికేషన్ పంపవచ్చు. అసైన్‍మెంట్స్,  డైలీ షెడ్యూల్‍, ఈవెంట్స్ రూపొందించి స్టూడెంట్స్ కు అసైన్‍ చేయవచ్చు. ఐకేర్‍ బస్‍ యాప్‍ ద్వారా పిల్లల లొకేషన్ ను ట్రాక్‍ చేయవచ్చు. డైలీ రిపోర్టులు, ఫోటోలు వంటి వాటివి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు పంపొచ్చు. కేఫ్టెరియా, క్యాంటీన్‍ మెనూ అప్‍డేట్‍ చేసే ఫెసిలిటీ ఉంటుంది.

ఎక్కడున్నా రిమైండ్‍ చేస్తుంది

ప్రతి విద్యార్థి సక్సెస్‍లో పరోక్షంగా భాగస్వాములు అవ్వాలనుకునే టీచర్లకు Remind: School Communication యాప్‍ ఎంతో ఉపయుక్తం. మీ తరగతి లేదా గ్రూప్‍తో ఒకేసారి కమ్యూనికేట్‍ కావడంతో పాటు ఒక్కో విద్యార్థితో వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు. ఎవరి ఫోన్‍కైనా నేరుగా టెక్స్ట్ మెసేజ్‍లు పంపొచ్చు. ఎవరు మెసేజ్‍ చదువుతున్నారు, ఎవరు మిస్‍ అవుతున్నారో తెలుసుకోవచ్చు. రిమైండర్లు షెడ్యూల్‍ చేసి పెట్టొచ్చు. ఫోటోలు, డాక్యుమెంట్లు వంటివి పంపవచ్చు. కంటెంట్‍ దాదాపు 85 భాషల్లోకి అనువాదం అయ్యే ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

పేపర్‍లెస్‍ అసైన్‍మెంట్స్ కు క్లాస్‍రూం

రొటీన్‍ కు భిన్నంగా మీ విద్యార్థులకు హోంవర్క్, అసైన్‍మెంట్స్ ఇవ్వాలనుకుంటున్నారా? పేపర్‍ వినియోగమే లేకుండా కరెక్షన్స్ కూడా ఆన్‍లైన్‍లోనే చేసేసి మార్కులు, గ్రేడింగ్‍ ఇస్తే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు Google Classroom యాప్‍ పర్‍ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. స్కూల్స్, కాలేజీలు, కోచింగ్‍ ఇన్‍స్టిట్యూషన్స్ వంటి విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లెవరయినా దీనిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. విద్యార్థులను ఇందులో భాగస్వాములు చేయాలంటే వారందరికీ గూగుల్‍ పర్సనల్‍ అకౌంట్ (జీమెయిల్‍) ఉండాలి.

ఇందులో మొదట టీచర్‍ అసైన్‍మెంట్‍ టాపిక్‍ క్రియేట్‍ చేయాలి. అది ఇవ్వాలనుకున్నవారిని ఈమెయిల్‍ ఐడీతో ఇన్వైట్‍ చేయాలి. నిర్ణీత సమయంలోపు సమాధానాలు రాసి పంపేలా సెట్టింగ్స్ చేయడంతో పాటు ఆన్సర్స్ ను ఆడియో, వీడియో, ఫోటోల రూపంలో లేదా ఎలా రాయాలో నిర్ణయించే అవకాశం టీచర్‍ కు ఉంటుంది. విద్యార్థులు ఎన్‍రోల్‍ చేసుకున్న తర్వాత సమాధానాలు రాసి సబ్‍మిట్‍ చేయాలి. అనంతరం టీచర్‍ కరెక్షన్‍ చేసి మార్కులు, గ్రేడింగ్‍ ఇస్తారు. వీటితో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్‍, ఆడియో, వీడియో ఫైల్స్ ను షేర్‍ చేయవచ్చు. తద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా విద్యార్థులు వాటిని యాక్సెస్‍ చేసుకోవచ్చు. క్లాస్‍రూం క్యాలెండర్‍ ను కూడా ఇందులో షేర్‍ చేయవచ్చు. పూర్తిగా పేపర్‍లెస్‍ అసైన్‍మెంట్స్ కోసం ఈ యాప్‍ ఎంతగానో ఉపయోగపడుతుంది.

సెక్యూర్‍ కమ్యూనికేషన్‍కు క్లాస్‍ట్రీ

ఈ సిగ్నేచర్స్, తల్లిదండ్రుల సమ్మతి లేదా అంగీకారం, రిపోర్టులు, ఫోటోలు షేర్‍ చేసుకోవడానికి చాలామంది టీచర్లు ఉపయోగిస్తున్న అత్యంత భద్రత కలిగిన ప్రైవేటు యాప్‍ Classtree. దీనిని ఉపయోగించి తల్లిదండ్రులను ఇన్వైట్‍ చేయవచ్చు. తరగతికి సంబంధించిన పోస్టులు చేయవచ్చు. ఒకరి యాక్టివిటీ మరొకరు చూడకుండా బ్లాక్‍ చేయవచ్చు. ఇతర టీచర్లు అప్‍డేట్స్ పోస్ట్ చేసేలా వారికి పర్మిషన్స్ ఇవ్వొచ్చు. విద్యార్థుల యాక్టివిటీస్‍ సంబంధించి ఫోటోలు తీసి షేర్‍ చేయవచ్చు. తల్లిదండ్రులందరికీ వ్యక్తిగతంగా పోస్ట్ లు చేయవచ్చు.

క్లాస్‍ మేనేజ్‍మెంట్‍కు టీచర్‍కిట్‍

స్కూల్లో టీచర్‍ యాక్టివిటీస్‍, తరగతులు, విద్యార్థులను సులువుగా మేనెజ్‍ చేసుకుంటూ టీచింగ్‍ను ప్రభావవంతంగా చేసుకోవాలంటే TeacherKit – Class manager అద్భుతంగా ఉపయోగపడుతుంది. అటెండెన్స్ ను తీసుకోవడంతో పాటు విద్యార్థుల ప్రవర్తనను ట్రాక్‍ చేసే ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో కమ్యూనికేట్‍ అవుతూ వారిని ఈ యాక్టివిటీస్‌లో ఎంగేజ్‍ చేయవచ్చు. టైంటేబుల్స్, అసైన్‍మెంట్స్, హోంవర్క్ వంటివి ఇందులో పొందుపరచవచ్చు. విద్యార్థుల పర్‍ఫార్మెన్స్ గురించి రికార్డులు మెయింటెన్‍ చేయవచ్చు.

BEST APPS FOR TEACHERS: టీచర్లకు ఉపయోగపడే బెస్ట్​ యాప్స్​…డౌన్​డోడ్​ చేసేకోండి..