గత కొంతకాలంగా దేశం చూపు మొత్తం గుజరాత్ ఎన్నికలపై పడింది. ఈ తరుణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో గుజరాత్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారో ఎవరు ఎన్ని సీట్లు సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం.. గత 27 సంవత్సరాల నుంచి గుజరాత్ లో బిజెపి ఏకధాటిగా పరిపాలన చేస్తోంది. ఇన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న కానీ బిజెపి పార్టీపై ఎక్కడ కూడా వ్యతిరేకత కనిపించలేదు.
పైగా ఈ ఎన్నికల్లో బిజెపి గుజరాత్ లో ఒక రికార్డు క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు. మిగతా ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఈ ఎలక్షన్స్ లో 52.50% ఓట్లు సాధించింది బిజెపి.. దీనికి ప్రధాన కారణం ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లో పోటీకి దిగడం, కాంగ్రెస్ ఓట్లు కాస్త చిలిపోవడం బిజెపికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అయితే పంజాబ్ లాగా గుజరాత్ లో కూడా రిజల్ట్ తారుమారవుతాయని అనుకున్న కేజిరివాల్ అంచనాలు తలకిందులు అయ్యాయి.
మోడీ మానియా ముందు నిల్వ లేకపోయాడు. మరి అలాంటి గుజరాత్ లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించిందో ఇప్పుడు చూద్దాం.. గుజరాత్ లో మొత్తం సీట్ల సంఖ్య 182, 92 మ్యాజిక్ ఫిగర్ దాటితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ బిజెపి ఇక్కడ రికార్డు స్థాయిలో 156 సీట్లు సాధించింది. బిజెపికి ప్రధాన ప్రత్యర్థిగా పోటీలోకి దిగిన కాంగ్రెస్ 17 సీట్లకే పరిమితమైంది. ఇక ఆమ్ ఆద్మీ ఐదు సీట్లు, ఇతరులు నాలుగు సీట్లు సాధించారు.. మొత్తానికి గుజరాత్ లో మరోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.
గుజరాత్ లో బిజెపి ఘనవిజయం వెనుక ఆమ్ ఆద్మీ ఉందని మీకు తెలుసా..?