BANK HOLIDAYS: 4 రోజులు బ్యాంకులకు వరస సెలవులు

4 days bank holidays

కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు బ్యాంకులకు నాలుగు రోజులు వరస సెలవులు రానున్నాయి. ఒకే రాష్ట్రం, ఒకే గ్రామీణ బ్యాంకు నినాదం మేరకు పలు రకాల బ్యాంకులు విలీనం కానున్నాయి.

ప్రస్తుతం తెలంగాణాలో ఆంధ్రప్రదేశ్​ గ్రామీణ వికాస బ్యాంకుతో పాటు తెలంగాణ గ్రామీణ బ్యాంకులు ఖాతా దారులకు సేవలు అందిస్తున్నాయి. కాగా కేంద్ర నిబంధనల మేరకు ఈ రెండు బ్యాంకులు విలీనం కానున్నాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏపీజీవీబీ బ్యాంకు విలీనం కానుంది.

జనవరి 01 నుంచి పూర్తిగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలు అందించనుంది. ఈ కారణంగా డిసెంబర్ 28 నుంచి డిసెంబర్​ 31 వరకు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంచ్​లో బ్యాంకింగ్ సేవలతో పాటు ఏటీఎం, యూపీఐ ATM, UPI మొబైల్​ బ్యాంకింగ్​, ఇంటర్నెట్​ బ్యాంకింగ్​, ఏఈపీఎస్​, సీఎస్​పీ మొదలగు అన్నిసేవలు నిలిచిపోనున్నాయి.

ఈ మేరకు పై రెండు బ్యాంకుల ఖాతాదారులను బ్యాంకు అధికారులు అప్రమత్తం చేస్తున్నాయి. ఏవైనా లావాదేవీలు ఉంటే పైన పేర్కొన్న సెలవులను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతోంది.

ఇది కేవలం ఈ రెండు రకాల బ్యాంకులకు మాత్రమే వర్తిస్తుంది.మిగతా అన్ని బ్యాంకులు పూర్తి సేవలను నిరంతరాయంగా అందిస్తాయి.

Leave a Comment