భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం..అత్యధికంగా హిందూ జనాభా భారతదేశంలోనే ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం హిందువులు అనేక దేవుళ్ళ మాలలు ధరిస్తారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగింది అయ్యప్ప మాల.. ఈ మాలలు ఎంతో నిష్టగా,నియమ నిబంధనలతో ధరించి పాటిస్తారు. చిన్న తప్పు కూడా చేయకుండా మాల విరమణ వరకు ఉంటారు. అలాంటి అయ్యప్ప మాల వేసుకున్న వారు ఇలాంటి కొన్ని తప్పులు చేస్తే జీవితంలో అనేక ఇబ్బందుల పాలై కుటుంబం కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఆ తప్పులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలనుకునేవారు మూడు రోజుల ముందు నుంచే పవిత్రంగా ఉండాలి. ఇందులో ముఖ్యంగా మద్యం, మాంసం వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మాల వేసుకునే సమయంలో తల్లిదండ్రులు భార్య అనుమతి తప్పనిసరిగా ఉండాలి. వీరిలో ఏ ఒక్కరి అనుమతి లేకున్నా ఫలితం ఉండదు. ముఖ్యంగా కుటుంబంలో తల్లిదండ్రులు మరణిస్తే ఏడాది పాటు మాల వేసుకోరాదు. భార్య మరణిస్తే ఆరు నెలల పాటు దీక్షకు దూరంగా ఉండాలి. మాల ధరించే రోజు శుభ్రమైన దుస్తులు వేసుకొని చెప్పులు లేకుండా నల్లని లుంగీ కండువా చొక్కా ఒక తులసి మాల తీసుకొని అయ్యప్ప ఆలయానికి వెళ్లాలి.
సూర్యుడు నెత్తిమీదికి వచ్చాక మధ్యాహ్నం మూడు గంటల లోపు దీక్ష చేయాలి. సాయంత్రం పూజ అనంతరం కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని తీసుకోవాలి. కటిక నేలపై నిద్రిస్తూ ఉల్లి, వెల్లుల్లి లేకుండా సాత్విక భోజనం చేయాలి. మలవిసర్జనకు వెళితే స్నానం ఆచరించి స్వామివారి శరణు ఘోష చెప్పి హారతి తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు ఒక దేవాలయాన్ని దర్శించుకోవాలి. ఎల్లప్పుడూ స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని జపించాలి. అంతేకాకుండా ఇంకా చాలా నియమాలు ఉంటాయి.. ప్రస్తుతమున్న నియమాల్లో ఏ ఒక్క నియమాన్ని తప్పుగా పాటించిన మన జీవితంలో అనేక కష్టాలు కుటుంబం నాశనానికి దారితీస్తుందని కొంతమంది ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు..
అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే మీ కుటుంబం నాశనమే..!!