కొంతమంది ఎంత వర్క్ చేసిన డబ్బు అనేది మిగలదు. అది మిగలకపోగా విపరీతమైన అప్పుల పాలవుతారు. మీరు ఎంత డబ్బు సంపాదించినా మీరు సంపాదించిన డబ్బంతా అప్పు కింద జమవుతూ ఉంటుంది. ఎంత కట్టడి చేసిన అప్పులు తీరవు. అలా అప్పులతో సతమతమవుతున్న వారు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. ఇవి పాటిస్తే వారు అప్పుల ఊబి నుంచి బయటపడతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సూర్యారాధన :
సాధారణంగా అప్పుల ఊబీ నుంచి బయట పడాలంటే సూర్యరాధన చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 11 ఎర్ర మిరపకాయలను ఒక కప్పు నీటిలో నానబెట్టి దాన్ని సూర్యుడికి సమర్పించండి. నమస్కరించి మీకు కావలసింది కోరుకోండి. దీంతో మీ సమస్యలు కాస్త గట్టేక్కుతాయి.
అరటి మొక్క నాటడం :
అంతేకాకుండా మీ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి విష్ణు దేవాలయం ఉంటే మాత్రం అక్కడికి వెళ్లి ఒక అరటి మొక్కను నాటాలి. ఆ మొక్క ఎప్పుడైతే పెరిగి ఫలాలను ఇవ్వడం మొదలు పెడుతుందో, మీ సమస్యలు అప్పులు ఒక్కొక్కటిగా ముగుస్తాయి.
రత్నాలు ధరించడం:
అంతేకాకుండా సరైన రత్నాలను కూడా ధరించడం ఈ సమస్యల నుంచి దూరం కావచ్చు. మీ జాతకాలు చూపించుకొని మీరు సరైన రత్నాన్ని ఎంచుకోండి.
నల్ల కుక్కకు ఆహారం :
మీరు అధిక అప్పులతో ఉన్నట్లయితే ప్రతి శనివారం నల్ల కుక్కకు ఆహారం పెట్టండి. అంతేకాకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని అలంకరించండి.
ఆంజనేయ ఆరాధన:
ఆంజనేయ ఆరాధన అనేది జీవితంలో అనేక సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా 40 రోజులపాటు రోజు 108 సార్లు హనుమాన్ దేవాలయం చుట్టూ పారాయణం చేస్తే అప్పులు ఇట్టే తీరిపోతాయి.
అశోక మొక్క పెంచడం:
అంతేకాకుండా మీ ఇంటి పెరట్లో అనువైన స్థలం చూసి అశోక మొక్కను పెంచితే మీరు అప్పుల నుంచి విముక్తి పొందుతారు.
astrology:అధిక అప్పులతో బాధపడుతున్నారా..అయితే ఈ పూజ చేయాల్సిందే..?