మానవ శరీరంలో ఎముకలతో పాటు కీళ్లను కూడా బలోపేతం చేయడంలో విటమిన్ డి అనేది ఎంతో ఉపయోగపడుతుంది. విటమిన్ డి లోపంతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే కొంతసేపు ఎండలో ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు.. మరి ఈ లోపం ఉన్నవారు ఎండలో నిలబడితే సరిపోతుందా.. ఎంతసేపు ఎండలో ఉండాలి.. ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
ముఖ్యంగా ఉదయం పూట సూర్యుడు ఉదయించే సమయంలో 20 నిమిషాల పాటు ఎండలో నిలబడితే సరిపోతుంది.. ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉంటే మాత్రం అది శరీరం పై పడకుండా చూసుకోవాలని వారు అంటున్నారు. అంతేకాకుండా సూర్యరశ్మి నేరుగా కళ్ళపై పడకుండా కూడా చూసుకోవాలి.. సూర్య రష్మి లో ఉండేటువంటి విటమిన్ డి ప్రోటీన్లు, ఎంజైముల ఏర్పాటులో తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా వ్యాధుల బారిన పడకుండా కూడా కాపాడుతుందని చెబుతున్నారు.
విటమిన్ డి లోపం వల్ల శరీరంలో ఎముకలు, కండరాలు, కీళ్లు, దెబ్బతింటాయని, అంతేకాకుండా జుట్టు రాలడం , శరీర బరువులో మార్పులు శ్వాసకోశ సమస్యలు వస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇలాంటి లక్షణాలు ఏమైనా మీలో ఉంటే విటమిన్ డి లోపం ఉన్నట్టే అని భావించాలి. సూర్యరశ్మిలో ఉండడమే కాకుండా సాల్మన్ చేపలు కూడా తినాలని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా గుడ్డులోని పచ్చ సొనా, మష్రూమ్స్, నారింజ రసం, సోయాపాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుందని పోషకాహార వైద్యులు తెలియజేస్తున్నారు.
విటమిన్ “డి” లోపంతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే..?