ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 యూనివర్సిటీల్లో 3,220 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో 278 బ్యాక్లాగ్, 2,942 రెగ్యూలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు నవంబర్ 20వ తేదీ సాయంత్రం 05 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలివే..
ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్రిపుల్ ఐటీ లెక్చరర్, అసిస్టెంట్ లెక్చరర్ పోస్టులకు ఆయా సబ్జెక్టుల్లో పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, యూజీసీ, ఏపీ నెట్, స్లెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా స్కీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అనంతరం ఇంటర్వ్యూ, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, చివరగా మెడికల్ టెస్టు ద్వారా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు ఇలా..
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 20వ తేదీ లోగా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. అనంతరం పోస్టు ద్వారా సర్టిఫికేట్లను నవంబర్ 27వ తేదీలోగా సమర్పించాలి. ప్రైమరీ జాబితాను నవంబర్ 30న, అభ్యంతరాలను డిసెంబర్ 07వరకు స్వీకరిస్తారు.
స్క్రినింగ్ టెస్టుకు అర్హత సాధించిన వారి జాబితాను డిసెంబర్ 08న ప్రదర్శిస్తారు.
మరింత సమాచారం కోసం కింది వెబ్సైట్ను సంప్రదించండి. https://recruitments.universities.ap.gov.in/Masters/Home.aspx
Ap university recruitment 2023: ఏపీ యూనివర్సిటీలో 3220 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్