AP TET NOTIFICATION 2024
టీచర్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET), డీఎస్సీని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి ఏపీ టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నామని ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే దరఖాస్తుల సంఖ్య ఆధారంగా పరీక్షల షెడ్యూల్ నిర్ణయిస్తామని తెలిపింది. కాగా, దరఖాస్తులు భారీగా వస్తే విడతల వారీగా పరీక్ష నిర్వహించనుంది. దీంతో పరీక్షల నిర్వహణకే 15 రోజులు పట్టే అవకాశం ఉంది. టెట్‌తో పాటే 10-15 రోజులు అటు ఇటుగా డీఎస్సీకి సైతం దరఖాస్తులు స్వీకరించనుంది.
5 లక్షల మంది హాజరయ్యే అవకాశం..
కాగా.. 2022, 2023 కాలంలో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా ఈ డీఎస్సీలో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ (AP TET) నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్ పరీక్షకు హాజరుకావొచ్చని విద్యాశాఖ అంచనా వేస్తుంది.