ap ration card aadhar card
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆధార్‌కార్డు, తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి 5నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశం కల్పించనున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలు కిందికి స్క్రోల్ చేయండి.

శ్రీకాకుళం జిల్లా సమీపంలోని ఆముదాలవలస గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్లో ఏపీ స్కిల్ డెవెలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఏసీ టెక్నీషియన్ కోర్సులు నేర్పిస్తున్నారు. అనంతరం సుశిక్షితులైన వారికి ఉద్యోగావకాశం కూడా కల్పిస్తున్నారు.
ఇందుకు టెన్త్ మెమో, రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉంటే చాలు. ఐదు నెలల పాటు శిక్షణ ఉంటుంది. ప్రతి బ్యాచ్‌లో 30 మందికి శిక్షణ ఇస్తారు. సీటు రిజ్వేషన్ చేసుకోవడానికి 9569077449 నెంబర్‌కు కాల్ చేసి సంప్రదించవచ్చు.