AP SCHOOL SUMMER HOLIDAYS 2024
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత దృష్ట్యా స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో స్కూళ్లు ఉదయం 7.45గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. half day schools

మార్చి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులకు ఇండ్లకు పంపిస్తారు. కాగా వార్షిక పరీక్షల నిర్వహణ అనంతరం వేసవి సెలవులు కూడా ప్రకటించనున్నారు. ts half day schoolsa
తెలంగాణాలోనూ రేపటి నుంచి (మార్చి 15) ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు నిర్వహించి ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
మరోవైపు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నేపథ్యంలో పది పరీక్షా కేంద్రాలున్న ప్రాంతాల్లో బడులకు ఆరు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
AP HALF DAY SCHOOLS: ఒంటిపూట బడులు ప్రారంభం