AP EDCET Counselling: ఏపీ ఎడ్‌సెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలివే..!

టీచర్‌ కొలువులో స్థిరపడాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అలాంటి వారు బీఈడీ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ బీఈడీ కోర్సుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి బీఈడీ కౌన్సెలింగ్‌ (B. Ed Counselling) షెడ్యూల్‌ విడుదల చేసింది.  జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

హైకోర్టు ఆదేశాలతో..

కాగా, గతేడాది జులై 14న ఎడ్‌సెట్‌ ఫలితాలను విడుదల చేసింది ఉన్నత విద్యా మండలి. అయితే, వివిధ కారణాలతో ఆరు నెలలు గడిచినా కౌన్సెలింగ్‌ నిర్వహించలేదు. దీంతో, అకడమిక్‌ ఇయర్‌ ఆలస్యం అవుతుందున్న ఉద్దేశ్యంతో యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అందులో భాగంగానే, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్నత విద్యామండలి తాజా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.