మేమిద్దరం టెన్త్ నుంచి ఫ్రెండ్స్.. ఆ తర్వాత ఇంటర్ ఇద్దరం ఒకే కాలేజీలోకి అడుగుపెట్టాం.. నా ఫ్రెండ్ యావరేజ్ స్టూడెంట్.. అలా కొన్ని రోజులు గడిచాయి.. మా క్లాసులోని బాగా చదివే ఒక టాపర్ అమ్మాయితో పరిచయం ఏర్పడింది.. ఆమె బాగా చదువుతుంది.. వీడేమో స్లో క్యాండిడేట్.. అలా వారి మధ్య స్నేహం ఏర్పడింది.. రోజులు గడుస్తున్నా కొద్దీ ఆ స్నేహం హద్దులు మీరుతోంది.. ఇద్దరు వేర్వేరు బెంచుల్లో కూర్చుని క్లాస్ వింటుంటే కూడా ఒకరినొకరు సైట్ కొట్టుకునేవారు.. కాలేజీ టైం కంటే ముందే వచ్చి ఇద్దరు ఒకే బెంచ్ పై కూర్చుని ఒకరి చేతిలో మరొకరు చేతివేసి ఏవేవో కబుర్లు చెప్పుకునే వారు..
ఈ విధంగా ఇద్దరు కలిసి ఒకే బెంచ్ పై కూర్చోవడం మొదలుపెట్టారు.. ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని క్లాస్ రూమ్ అంతా వీరిని గమనించేది. మధ్యాహ్నం లంచ్ టైం లో కూడా ఇద్దరు కలిసే ఉండేవారు. కాస్త టైం దొరికితే చాలు వీరిద్దరే తిరుగుతూ ఉండేవారు.. ఇలా కొన్ని నెలలు గడిచేసరికి ఇద్దరి ప్రవర్తనలో తేడా వచ్చింది. సెకండ్ ఇయర్ లోకి అడుగుపెట్టారు. వారితోపాటు వారి ప్రేమ కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. శరీరకంగా మూడు నాలుగు సార్లు కలిశారట..ఇక కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి.. ఆ అమ్మాయిని తప్పించుకుంటూ తిరుగుతూ వచ్చాడు. నీ కారణంగానే చదువుపై ఇంట్రెస్ట్ పోతోందంటూ ఆమెతో గొడవకు దిగాడు..
కానీ ఆ అమ్మాయి మాత్రం నువ్వు లేకుండా నేను ఉండలేను అంటూ అందరి ముందు విచిత్రంగా గళ్లా పట్టుకొని మరీ నిలదీసింది. ఈ విషయం పెద్ద రచ్చగా మారింది. చివరికి అతి కష్టం మీద ఇద్దరు ఇంటర్ పాసయ్యారు.. రెండు వేరువేరు కాలేజీల్లో ఇంజనీరింగ్ కూడా జాయిన్ అయ్యారు.. మళ్లీ ఇద్దరు వేర్వేరు వ్యక్తులతో కొత్త లవ్ స్టోరీలు మొదలుపెట్టారు.. ఇదే టాక్సిక్ లవ్ అంటే.. ఈ సమయంలో అట్రాక్షన్ ఎఫెక్షన్ కి తేడా తెలియకపోవడం.. చదువును పాడు చేసుకుని వారి మధ్య కలిగే ఫీలింగునే లవ్ గా ఫీల్ అవ్వడం.. తర్వాత డిస్ట్రబ్ అవుతున్నామని తెలుసుకొని మార్పులు తెచ్చుకోవడం.. కాబట్టి 25 ఏళ్ల లోపు లవ్వు కొవ్వులకు దూరంగా ఉంటే ఫ్యూచర్ బాగుంటుందని నిపుణులు అంటున్నారు.
టాక్సీక్ లవ్.. ఇంటర్ లోనే హద్దులు మీరిన జంట..!!