ప్రస్తుత కాలంలో వావి వరసలు అనేవి ఉండటం లేదు.. అన్నా చెల్లెలు, తండ్రి బిడ్డలు ఇలా వరుసలు మరిచి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.. ప్రస్తుతం అలాంటి ఓ సంఘటనే కలకలం రేపుతోంది.. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ఝాన్సీ సిటీకి దగ్గరలో ఉన్న గరిహియాగావుకు చెందినటువంటి సురేష్ అదే ప్రాంతానికి చెందిన మమతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే సురేష్ అన్న కొడుకు అయినా విజయ్ తరచుగా వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ తరుణంలో విజయ్ కి మమతకు మధ్య పరిచయం పెరిగింది.
రాను రాను అది ప్రేమగా మారింది. చివరికి ఇద్దరు కలిసి ఏకాంతంగా జీవించాలని నిశ్చయించుకున్నారు. మమత పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయకుండా విజయ్ తో పాటు వెళ్లిపోయింది. ఇలా ఇరు కుటుంబాల్లో ఇద్దరు కనిపించకుండా వెళ్లిపోవడంతో వారు అన్నిచోట్ల వెతికారు. రోజులు గడుస్తున్నా కుమారుని ఆచూకీ దొరకపోవడంతో విజయ్ తల్లి చివరికి పోలీసులను ఆశ్రయించింది.
చివరికి పోలీసులు విజయ్ ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేసి లోకేషన్ ద్వారా ఆయన ఎక్కడ ఉన్నారో కనుక్కొని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. మేమిద్దరం భార్యాభర్తల్లా జీవిస్తున్నామని అన్నారు. దీంతో పోలీసులు వారిని స్వగ్రామానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో మమత షాకింగ్ విషయాలు బయటపెట్టింది. మొదటి భర్త సురేష్ అంటే నాకు ఇష్టం లేదని విజయ్ తో ప్రేమలో ఉన్నానని చెప్పుకొచ్చింది. అయితే ఈ ఘటన పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి.
వరుసకు పిన్ని కొడుకులు.. పిల్లల్ని కాదని మహిళ కొడుకుతో జంప్..!!