భార్యాభర్తల మధ్య గొడవలా..వెంటనే గదిలో ఈ వస్తువులు తీసేయండి..!!

కొంతమంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే తరచూ గొడవలు జరిగి పెద్ద గాలి వానలా మారతాయి. అందులో విషయం ఏమి ఉండదు కానీ గొడవ మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. అలా తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే మాత్రం వాస్తు టిప్స్ తప్పనిసరిగా పాటించాల్సిందే అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న బెడ్ రూమ్ లో ఇలాంటి వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే అని లేదంటే గొడవలు పెరిగిపోతాయని తెలియజేస్తున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నల్లని వస్తువులు:
మీరు పడుకునే గదిలో ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి కానీ, గదిలోని వస్తువులన్నీ చిందరవందరగా ఉంటే మాత్రం భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయట.. అంతేకాకుండా పడక గదిలో నల్లని వస్తువులు అస్సలు పెట్టుకోకూడదని అలా పెట్టడం వల్ల కూడా గొడవలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు..
చెత్త:
ముఖ్యంగా మనం ఉండే పడక గదిలో ఎప్పుడు నీట్ గా ఉండాలి.. కానీ చెత్తాచెదారంతో నిండి ఉంటే మీకు చికాకు కలిగి గొడవలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా టీవీ,ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా ఎక్కువగా ఉంచుకోకూడదని తెలియజేస్తున్నారు.
మొబైల్స్ వల్ల గొడవ:
చాలామంది భార్యాభర్తలు ప్రతిరోజు చేసే తప్పు ఇదే.. రాత్రి పడుకునే ముందు ఎక్కువగా ఫోన్లు పట్టుకొని చూడటం, ఫోన్లు చూసుకుంటూ అలాగే ఉండిపోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయని దీనివల్ల సంసార జీవితంలో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కాబట్టి ఈ వస్తువులను దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండాలని తెలియజేస్తున్నారు.

భార్యాభర్తల మధ్య గొడవలా..వెంటనే గదిలో ఈ వస్తువులు తీసేయండి..!!