DIGITAL MARKETING COURSES
నేటి ఆధునిక ప్రపంచంలో డిజిటల్ మార్కెటింగ్ పరిధి వేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో శిక్షణ పొందిన వారికి అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అందుకే, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారికి బెస్ట్ ఆప్షన్‌గా మారింది. మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారా.. అయితే, ఈ ఇంటర్న్‌షిప్ వివరాలు తెలుసుకోండి.
దేశంలోనే పలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, విద్యా సంస్థలు డిజిటల్ మార్కెటింగ్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నాయి. కోర్సులో భాగంగా స్టైఫండ్ కూడా అందజేస్తున్నాయి. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందేలా శిక్షణ తర్ఫీదు అందించడం ఈ ఇంటర్న్‌షిల ప్రత్యేకత. వీటి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేషన్‌ను మీ రెజ్యూమోలో పొందుపర్చడం ద్వారా సులభంగా ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
ఇంటర్న్‌షిప్ అందిస్తున్న విద్యా సంస్థలివే..
ఐఐటీ బాంబే, కారట్లేన్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, స్కేలర్ అకాడమీ, సారెగామా ఇండియా వంటి పలు ప్రతిష్టాత్మక ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు 6 నెలల వ్యవధి గల ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ వ్యవధిలో స్టైఫండ్‌తో పాటు పలు సౌకర్యాలు కూడా అందజేస్తున్నాయి. దరఖాస్తు తేదీలు, అర్హత, స్టైఫండ్ వివరాలు ఆయా విద్యా సంస్థల వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.