SCHOOL HOLIDAY DUE TO TOOFAN

మిగ్​జాం తుఫాన్​ ప్రభావం కారణంగా ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించింది. ఏపీతో పాటు తమిళనాడులో తుఫాన్​ త్రీవ రూపం దాల్చింది. ఆయా జిల్లాల్లో తుఫాన్​ ప్రభావం దృష్ట్యా జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

ఇప్పటికే తుఫాన్​ ప్రభావం కారణంగా ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు డిసెంబర్​ 05న కూడా సెలవు ప్రకటించాలని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, గుంటూరు, ప్రకారం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది.

తుఫాన్​ హెచ్చరికల కారణంగా హైదరాబాద్​ నుంచి ఏపీ నడిచే రైళ్లు నిలిచిపోయాయి. ఈ మేరకు ప్రయాణికులకు రైల్వే శాఖ ప్రకటన జారీ చేసింది.