DIWALI HOLIDAY 2023: దీపావళి సెలవు రద్దుపై కీలక నిర్ణయం?

దీపావళి సెలవులపై సందిగ్ధత నెలకొంది. నవంబర్​ 12న దీపావళి సెలవు ప్రకటించగా.. ఆరోజు ఆదివారం కావడంతో సోమవారం కూడా సెలవు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తడి వచ్చింది. ఈ నేపథ్యంతో ప్రభుత్వం నవంబర్​ 13 సోమవారం కూడా సెలవు ఇస్తున్నట్టు జీవో జారీ చేసింది.

కాగా తాజాగా సోమవారం సెలవు రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణాలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా.. షెడ్యూల్​ ప్రకారం నవంబర్​ 30న పోలింగ్​ ఉంది. ఈ మేరకు సోమవారం సెలవు ఇస్తే.. షెడ్యూల్​ మార్పు చేయాల్సి వస్తుందని సీఈసీ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో సోమవారం సెలవును రద్దు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

అయితే స్కూళ్లు, కాలేజీలకు సెలవు కొనసాగిస్తూ.. ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం సెలవు రద్దయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది.

DIWALI HOLIDAY 2023: దీపావళి సెలవు రద్దుపై కీలక నిర్ణయం?