ap schools re opening orders: స్కూళ్ల పున: ప్రారంభంపై సర్కారు కీలక ఆదేశాలు

ఏపీలో వేసవి సెలవుల అనంతరం సూళ్ల పున: ప్రారంభంపై విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్​ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు 2023–24 అకడమిక్​ క్యాలెండర్​ను విడుదల చేశారు.

2023–24 అకడమిక్​ క్యాలెండర్​లో ఈ ఏడాది పాఠశాలల పనిదినాలు, సెలవులు, పరీక్షల షెడ్యూల్​ను విడుదల చేశారు.

సెలవుల వివరాలివే..

దసరా సెలవులు అక్టోబరు 14 నుంచి 24 వరకు.. నవంబరు 12న దీపావళికి సెలవు. డిసెంబరు 25న క్రిస్మస్‌.. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 18 వరకు ప్రకటించారు. క్రిస్టియన్‌ మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 21 నుంచి 24 వరకు.. క్రిస్మస్‌ సెలవులు డిసెంబరు 17 నుంచి 26 వరకు..సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఇస్తారు. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం విద్యార్థులకు 88 రోజులు సెలవులు మిగతా రోజులు పనిదినాలుగా ఉండనున్నాయి.

పరీక్షల షెడ్యూల్​


–ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఫార్మెటివ్-1 పరీక్షల్ని ఆగష్టు 1-4మద్య నిర్వహిస్తారు. ఫార్మెటివ్-2 అక్టోబర్ 3-6 తేదీల మధ్య నిర్వహిస్తారు. సమ్మెటివ్-1 పరీక్షలు నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తారు.
–ఫార్మెటివ్-3 పరీక్షలు జనవరి 3-6 తేదీలలో, ఫార్మెటివ్-4 పరీక్షలు ఫిబ్రవరి 23-27తేదీల్లో నిర్వహిస్తారు. పదోతరగత ప్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 23-29 వరకు నిర్వహించనున్నారు.

ap schools re opening orders: స్కూళ్ల పున: ప్రారంభంపై సర్కారు కీలక ఆదేశాలు