ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్ష తేదీలను ప్రకటించడంతో విద్యార్థులంతా ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఈ తరుణంలోని తాజా విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బయటపెట్టింది. సీబీఎస్ఈ 2023 పరీక్ష తేదీలను మార్చనున్నామని తెలియజేసింది. ఈ వివరాలు ఏంటో చూద్దాం.. మార్చిన తేదీ షీట్ ను సీబీఎస్ ఈ దాని యొక్క అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది. మార్చిన తేదీల ప్రకారం ఇంటర్ డేట్ షీట్ లో ఏప్రిల్ 4, 2023 లో జరగాల్సిన పరీక్షను మార్చి 27, 2023 కు మార్చింది.
అలాగే cbsc డిసెంబర్ 29న 10 మరియు 12వ తరగతి బోర్డు పరీక్షా తేదీన షీట్ ను విడుదల చేసింది. ఆ తేదీలనే ప్రస్తుతం మార్చేశారు. కానీ పదోతరగతి పరీక్షల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. టెన్త్ పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై మార్చి 21న కంప్లీట్ అవుతాయి. అలాగే 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై 2003 ఏప్రిల్ 5వ తేదీన ముగుస్తాయి. 10,12 తరగతుల పరీక్షలు ఉదయం 10:30 కు మొదలై మధ్యాహ్నం 1.30 గంటలకు ముగుస్తుంది. అంతేకాకుండా విద్యార్థులు ప్రశ్నాపత్రాన్ని చదువుకోవడానికి 15 నిమిషాల అదనపు సమయాన్ని ఇస్తారు.
ఈ ఎగ్జామ్స్ కు సంబంధించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు సీబీఎస్ఈ యొక్క అధికారక సైట్ లో వెతకవచ్చు. సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్ ఇంటర్ మరియు టెన్త్ అడ్మిట్ కార్డులను జనవరిలో విడుదల చేస్తుందట. విద్యార్థుల యొక్క తేదీ షీట్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి సిబిఎస్ ఈ అధికారిక వెబ్సైట్ cbse.gov. in లో సంప్రదించండి. స్టూడెంట్స్ హోం పేజీలో కనిపించే సీబీఎస్ఈ 12వ తరగతి డేట్ షీట్ లింకుపై క్లిక్ చేయగానే పిడిఎఫ్ ఫైల్ కనబడుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ అవుట్ తీసుకోండి.
big breking: Board exams ఇంటర్ ఎగ్జామ్స్ తేదీల్లో మార్పులు..కొత్త డేట్స్ ఏంటంటే..?