Tspsc group 4: గ్రూప్ 4 ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసిన కమిషన్.. ఆ ఛాన్స్ లేదంటూ..?

నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గ్రూప్ 4 నోటిఫికేషన్ రానే వచ్చింది. దీంతో నిరుద్యోగులంతా ఒక్కసారిగా పుస్తకాల వైపు ఉరుకులు,పరుగులు పెడుతున్నారు. ఎలాగైనా ఉద్యోగం కొట్టాలనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించిందని చెప్పవచ్చు. టిఎస్పిఎస్సి గ్రూప్ 4 మొత్తం 9,168 పోస్టులకు గాను నోటిఫికేషన్లు జారీ చేసింది. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. అయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్లు డిసెంబర్ ఒకటో తేదీన విడుదల చేసిన విషయం మనందరికీ. కానీ మొదటిసారి వచ్చిన ప్రకటన ప్రకారం..

దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 23వ తేదీన ఉంటుందని టీఎస్పీఎస్సీ కమిషన్ తెలిపింది. కానీ కొన్ని సాంకేతిక ప్రాబ్లమ్స్ వల్ల దరఖాస్తుల ప్రక్రియను వాయిదా వేసింది. మళ్లీ ఈ ప్రక్రియ డిసెంబర్ 30వ తేదీన ప్రారంభించినట్టు ప్రకటన విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ మొదలు కావడంతో, దరఖాస్తు గడువును కూడా పొడిగించారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 19 వరకు ఉంటుందని అన్నారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని తెలియజేశారు.

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం సందర్భంగా Tspsc అనిత రామచంద్రన్ ఒక కీలక ప్రకటన చేశారు. ఈనెల 30వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov. in/లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా మరో ప్రధాన అంశాన్ని బయటపెట్టారు. దరఖాస్తు ప్రక్రియను పొడిగించే అవకాశం అస్సలు లేదని స్పష్టం చేశారు. కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులంతా సాధ్యమైనంత ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చెప్పగానే చెప్పారు.

Tspsc group 4: గ్రూప్ 4 ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసిన కమిషన్.. ఆ ఛాన్స్ లేదంటూ..?