1.ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు.
- ఆంధ్రప్రదేశ్ మంత్రి అప్పలరాజుకు చేదు అనుభవం. నిర్వాసితులకు ఇస్తున్నటువంటి ఇళ్ల స్థలం వారికి సరిపోవడం లేదని ఎక్కువ స్థలం ఇవ్వాలని ఆయనను అడ్డుకున్నారు.
- ప్రధాని మోడీకి మాతృవియోగం. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్ ఆసుపత్రిలో వేశారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు.
- అడవి శేష్ 2022లో సూపర్ హిట్ సక్సెస్ తో దూసుకొచ్చాడు. మళ్లీ గూడాచారి2 తో మన ముందుకు రాబోతున్నాడు.
- సాకర్ దిగ్గజం పిలే మృతి. ఫుట్బాల్ ఆటలో అత్యంత ప్రతిభ కనబరిచి మంచి పేరు సంపాదించిన ఫిలే గురువారం మృతి చెందారు.
- ఇజ్రాయిల్ కొత్త ప్రధానిగా నేతాన్యాహు ప్రమాణ స్వీకారం చేశారు.
7.చైనా నుంచి ఎవరైనా ఇండియా కు వస్తే మాత్రం తప్పనిసరిగా కరోనాకు సంబంధించి నివేదిక ఇవ్వాలని కేంద్రం నిబంధనలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం.
- ఏడేళ్ల కనిష్టానికి స్థూల ఎన్ పిఏలు : బ్యాంకుల యొక్క స్థూల నిరార్ధక ఆస్తుల నిష్పత్తి ఏడేళ్ల కనిష్టానికి ఐదు శాతం దిగివచ్చినట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
- 8 ఏళ్ల బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం చేసిన ఘటన చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలంలో చోటుచేసుకుంది.
- దేశంలో హింసను ప్రేరేపిస్తూ కుల,మతాలను రెచ్చగొడుతూ, విచ్ఛిన్నకర శక్తిగా మారినటువంటి బిజెపిని ఎలాగైనా తరిమేయాలని కేరళ ముఖ్యమంత్రి ఫినరై విజయన్ అన్నారు.