December 29 top news: ఈరోజు ముఖ్యవార్తలు..!

  1. తెలంగాణలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల వివాదం ఎట్టకేలకు హైకోర్టుకు చేరింది. అభ్యర్థుల ఎత్తుకొల్చే డిజిటల్ మీటర్లు తప్పుడు సమాచారం చూపిస్తున్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
  2. చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఏడుగురి వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది.
  3. చైనాలో కరోనా అల్లకల్లోలం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో చైనా దేశంలో మందులు కొరత ఏర్పడింది. అక్కడి ప్రజలంతా ఇండియా మందుల కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది.

3.పది స్థానాలకు దూసుకు వచ్చిన శ్రేయస్ అయ్యారు. టెస్ట్ సిరీస్ లో విఫలం కావడంతో విరాట్ కోహ్లీ ర్యాంక్ కిందికి పడిపోగా, శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్, అశ్విన్ దూసుకెళ్లారు.

  1. క్యాబ్లో మహిళపై అత్యాచారం..
    ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. 23 ఏళ్ల మహిళా నోయిడా నుంచి ఫిరోజాబాద్ వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసింది. దీంతో అదును చూసిన వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
  2. భరత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీకి భద్రత పెంచాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ లేఖ రాశారు.
  3. పాత వాహనాల అమ్మకాల్లో ఇబ్బందులను పరిష్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

6.అమెరికాలో మంచు తుఫాన్ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. పశ్చిమ న్యూయార్క్ లో 30 మంది దుర్మరణం. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం.

  1. తెలుగుతో సహా పాన్ ఇండియా లెవెల్ లో ఎంతో పేరు తెచ్చుకున్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే 2022 సంవత్సరంలో కలిసి రాలేదని చెప్పవచ్చు. వరుస ఫ్లాపులతో సతమతం అవుతోంది.
  2. మనదేశంలో ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ ఏమీ లేదని , కానీ వచ్చే 40 రోజుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.
  3. నేడు హోం మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక భేటీ. పలు అంశాలపై చర్చ.
  4. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ సంస్థ పగ్గాలు చేపట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సక్సెస్ఫుల్ బిజినెస్ కోసం ఆయన ఎలాంటి కష్టాలు పడ్డారో తెలియజేశారు.