గత రెండు పర్యాయాలు ఏకధాటిగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ మరోసారి గద్దెనెక్కి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ సారి పక్కా వ్యూహంతో ఆలోచనలు చేస్తూ ముందుకు వెళుతోంది. తెలంగాణలో ఇబ్బందిగా మారిన స్థానాలను గుర్తించి అక్కడ ఏ అభ్యర్థిని పెడితే సీటు వస్తుందో గుర్తించి దానికి తగ్గట్టుగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ తరుణంలోనే బిఆర్ఎస్ దృష్టి ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గం పై పడింది. ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది. ఈ తరుణంలో భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదాం వీరయ్య ను ప్రధాన ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఆయనను బీఆర్ఎస్ లో చేర్చుకొని పోటీలో దించాలనే యోజనలో కేసిఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలోనే మంగళవారం హనుమకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోదాం వీరయ్య కలుసుకోవడం ఈ వార్తకు మరింత బలాన్నిస్తోంది..
పార్టీ మారితే తనకు ఇచ్చే సీటుపై చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే రాబోవు ఎన్నికల్లో ములుగు టికెట్ తో పాటుగా, ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాలనే హామీ పోదాం వీరయ్య కోరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరయ్య గతంలో రెండుసార్లు ములుగు నుండి, ప్రస్తుతం భద్రాచలం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..?
Telangana: బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే చూపు..MLA సీతక్కే లక్ష్యమా..?