గత రెండు సంవత్సరాల నుండి కరోనా కారణంగా చాలామంది టెన్త్ విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. దీంతో విద్యార్థులను ప్రభుత్వాలు మార్కులు వేసి పాస్ చేశాయి. కానీ 2022వ సంవత్సరం కరోనా తగ్గుముఖం పట్టడంతో చదువులు కాస్త గాడిన పడ్డాయి. ఇప్పుడిప్పుడే అన్ని ఎగ్జామ్స్ నిర్వహించుకుంటున్నాం. ఈ విద్యా సంవత్సరాన్ని కంప్లీట్ గా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ తరుణంలోనే పదవ తరగతి ఎగ్జామ్స్ కు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.
ఏప్రిల్ మూడవ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన జారీ చేసింది. ఈసారి 9 మరియు 10వ తరగతి విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఇక 9, 10వ తరగతికి సంబంధించి ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 2022- 2023 విద్యా సంవత్సరానికి గాను ఈ యొక్క సంస్కరణలు అమలులో ఉంటాయని పేర్కొంది.
ఒక్కో సబ్జెక్టు పరీక్షకు సంబంధించి 80 , అసైన్మెంట్ 20 చొప్పున మొత్తం 100 మార్కులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక సైన్స్, ఫిజికల్ సైన్స్, మరియు బయాలజీ కలిపి సగం మార్కులు ఉంటాయని తెలియజేసింది. ఒక సైన్స్ ఎగ్జామ్స్ కు మాత్రమే 3.20 గంటల సమయం ఉంటుందని, మిగతా అన్ని సబ్జెక్టులకు మూడు గంటల సమయం మాత్రమే ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని, ఇప్పటి నుంచే పరీక్షలకు సన్నద్ధమై మంచి మార్కులు సాధించాలని కోరుకుందాం.
Ts Tenth Exams: తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్.. ఈసారి ఎన్ని పేపర్లంటే..?