తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు రైతుల పాలిట వరంగా మారింది. ఈరోజు పదో విడత రైతుబంధు డబ్బులు రైతన్నల అకౌంట్లో జమ కానున్నాయి . ఉదయం నుంచి డబ్బులను వారి వారి ఖాతాల్లో వేయనుంది ప్రభుత్వం. మొదటిరోజు ఎకరం లోపు ఉన్న రైతులకు డబ్బులు అందుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.. ఈసారి ఎన్ని లక్షల మందికి డబ్బుల సాయం అందనుందో తెలుసుకుందాం..
ఈ పదో విడత రైతుబంధు సాయంలో 70.54 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి 5000వేల చొప్పున సాయం అందనుంది. ఈ సీజన్ లో 1.53 కోట్ల ఎకరాలకు రైతుబంధు ఇవ్వనున్నట్లు, ఇప్పటికే 9 విడతలు కలిపి 57,882 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేసామని, ప్రస్తుతం పదో విడత కలిపితే 65,559. 28 కోట్లకు చేరుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులను రాజు చేయాలని లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతోందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
రైతు బాగుంటే దేశమంతా బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఏనాటికైనా రైతు ప్రభుత్వమే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.అంతేకాకుండా రైతు బంధు, సాగునీరు, ఉచిత విద్యుత్ రైతుల యొక్క హక్కని, కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని అమలు చేయడం లేదన్నారు. అబద్ధపు మాటలతో గద్దెనెక్కిన నరేంద్ర మోడీ స్పష్టమైన వ్యవసాయ విధానాన్ని తీసుకురాలేకపోయారని విమర్శలు గుప్పించారు. బీఆర్ ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా రైతుబంధు తీసుకువస్తామని ఆయన అన్నారు.
రైతుబంధు పడిందా.. ఈసారి ఇన్ని లక్షల మంది పెరిగారా ..?