నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా భారీ అంచనాలతో రిలీజ్ అయిన మూవీ 18 పేజెస్. ఈ చిత్రాన్ని జిఏ 2 పిక్చర్స్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇందులో నిఖిల్ ,అనుపమ పరమేశ్వరన్ కాంబో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా మొదటి రోజు నుంచే ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయింది. 18 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి నాన్ థ్రియేట్రీకల్ రన్ తో 20 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందట. ఈ విధంగా సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాలోని బ్రహ్మాజీ పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
ఈ సినిమా ద్వారా బ్రహ్మాజీకి ఘోర అవమానం జరిగిందంటూ ఆయన అభిమానులు అంటున్నారు. ఇంతకీ జరిగిన అవమానమేంటయ్య అంటే.. ఈ చిత్రంలో బ్రహ్మాజీకీ సంబంధించిన కొన్ని సన్నివేశాలను డిలీట్ చేశారని అభిమానులు అంటున్నారు.. సాధారణంగా సినిమాలో నిడివి ఎక్కువైతే కొన్ని షూట్ చేసిన పాత్రలను తొలగిస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే బ్రహ్మాజీ పాత్రను కూడా ఈ 18 పేజెస్ సినిమాలో తొలగించినట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో బ్రహ్మాజీ నాలుగైదు సన్నివేశాలలో మాత్రమే కనిపిస్తారని కానీ ఎడిటింగ్ లో అవి కూడా పోయాయని సమాచారం..
అయితే సినిమా ట్రైలర్ లో బ్రహ్మాజీ పాత్రను హైలైట్ గా చేసి సినిమాకు వచ్చేసరికి డిలీట్ చేయడం తో ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు.. ఓవర్సీస్ ప్రింట్లలో బ్రహ్మాజీ కి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. కానీ ఇండియాలో మాత్రం లేవంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. మరి ఇదే విషయంపై సోషల్ మీడియా లో ఇంత రచ్చ జరుగుతున్నా బ్రహ్మాజీ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.. మరి దీనిపై ఆయన ఏమంటారో ముందు ముందు తెలుస్తుంది.
18 pages: 18పేజెస్ చిత్రంలో నటుడు బ్రహ్మాజీకి ఘోర అవమానం..!!